France Grouned Plane With Indians:
హ్యూమన్ ట్రాఫికింగ్..?
హ్యూమన్ ట్రాఫికింగ్ అనుమానంతో ఫ్రాన్స్‌లో ఓ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో దాదాపు 303 మంది భారతీయ ప్రయాణికులున్నారు. నికరాగ్వాకి చెందిన ఫ్లైట్‌లో వందలాది మందిని అక్రమంగా తరలిస్తున్నట్టు అనుమానం వచ్చి ఆరా తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారతీయ అధికారులకూ ఈ సమాచారం అందించారు. ఆయా ప్రయాణికులక ఐడీ కార్డ్‌లను తనిఖీ చేసిన అధికారులు..వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రొమానియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ కి చెందిన ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి బయల్దేరింది. రీఫ్యుయెలింగ్ కోసం Vatry airport వద్ద ఆగింది. అప్పటికే పోలీసులకు సమాచారం అందింది. విమానంలో 303 మంది భారతీయులున్నట్టు తెలిసింది. వీళ్లందరితో UAEలో పని చేయించుకునేందుకు అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందింది. విచారణా అధికారులు విమానంలోని అందరి ప్రయాణికులను ప్రశ్నిస్తున్నారు. అదుపులోకి తీసుకుని టర్మినల్ బిల్డింగ్ వద్దకు తీసుకెళ్లారు. అయితే...విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలిసిందేంటంటే..వీళ్లను అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా పంపేందుకు సెంట్రల్ అమెరికాకి తరలిస్తున్నారు. ఈ ప్రయాణికుల్లో కొందరు మైనర్‌లు కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులు కాన్సులర్‌లోకి వెళ్లేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించింది. వాళ్ల భద్రతకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చింది.