Just In
AI Startup For Cheating: మోసాలు చేయడానికి మాత్రం ఏఐ అక్కర్లేదా- స్టార్టప్ పెట్టేసి 45 కోట్లు పెట్టుబడి లాగేసిన కుర్రోడు !
Interviews cheating: అమెజాన్, మెటా లాంటి కంపెనీల్లో ఇంటర్యూలు ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. అందుకే ఇంటర్యూల్లో మోసం చేయడానికి ఓ స్టార్టప్ వచ్చేసింది.
AI startup helps users cheat in Amazon Meta interviews: ఇప్పుడు ప్రతి అంశానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ స్టార్టప్‌లు వచ్చేస్తున్నాయి. అందుకేఓ ఇరవై ఒక్క ఏళ్ల విద్యార్థి వినూత్నంగా ఆలోచించాడు. భారీ టెక్ కంపెనీల్లో ఉద్యోగం సాధించేందుకు చాలా మంది కలలు కంటూ ఉంటారు. వారి కలలు నిజం చేసేందుకు ఓ ఏఐ స్టార్టప్ ను ప్రారంభించారు. అతని ఐడియా నచ్చి పెట్టుబడిగా రూ.45 కోట్లు గా ఇన్వెస్టర్స్ ఇచ్చారు. ఇంతకీ అతని స్టార్టప్ ఐడియా ఏంటో తెలుసా ?. టెక్ కంపెనీల ఇంటర్యూల్లో మోసం చేయడంఎలా అని.
అమెజాన్, మెటా, టిక్‌టాక్ వంటి టెక్ దిగ్గజాలలో వేసవి ఇంటర్న్‌షిప్‌లను పొందడానికి కోడింగ్ ఇంటర్వ్యూలలో మోసం చేయడానికి AI స్టార్టప్ సృష్టించాడు కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన 21 ఏళ్ల చుంగిన్ లీ అనే విద్యార్థి. తన వెంచర్‌ను 'మోసం యొక్క నిర్వచనాన్ని మార్చే ప్రయత్నం'గా లీ చెబుతున్నాడు. అతని స్టార్టప్ పేరు
ఇంటర్వ్యూ కోడర్. సాంకేతిక ఇంటర్వ్యూల సమయంలో లీట్‌కోడ్‌ను ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సహాయపడే ఒక అదృశ్య అప్లికేషన్‌ను అతను సృష్టించాడు. అతిపెద్ద టెక్ కంపెనీలను మోసం చేసినందుకు లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.
మా కంపెనీల్లో ఇలా ఫ్రాడ్ గాళ్లను చేరుస్తావా అని అమెజాన్, మెటా లీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అది విశ్వవిద్యాలయం నుండి అతని సస్పెన్షన్‌కు దారితీసింది. ఇంటర్వ్యూలు, పరీక్షలు , సేల్స్ కాల్‌లతో సహా ప్రతిదానిలోనూ మోసం చేయడానికి వినియోగదారులు హైడ్ ఇన్-బ్రౌజర్ విండోలను ..వారి స్క్రీన్‌లపై ఉన్న వాటిని విశ్లేషించడం, ఆడియో వినడం ,ప్రశ్నలకు సమాధానాలను సూచించడం ద్వారా యాప్ వినియోగదారులకు సాయపడుతుంది.ఇలా చేస్తున్నారని ఎదుట వ్యక్తిులకుతెలియదు.
విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ అయినా అతని స్టార్టప్‌కు ఇప్పటికే $5 మిలియన్లకు పైగా నిధులు పెట్టుబడులుగా వచ్చాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కంపెనీకి అబ్‌స్ట్రాక్ట్ వెంచర్స్, సుసా వెంచర్స్ మద్దతు ఇస్తున్నాయి. ఆదివారం ప్రారంభించినప్పటి నుండి ఇది దాదాపు 70,000 మంది వినియోగదారులను సంపాదించిందని లీ ప్రకటించారు. AI యుగంలో "మోసం" అనే భావనను పునరాలోచించాల్సిన అవసరం ఉందని లీ అంటున్నాయి. "AIని ఉపయోగించడం అనివార్యం ,మనమందరం అంగీకరించాల్సిన విషయమని అంటున్నార.ు
లీ ఇంటర్వ్యూ కోడర్‌ను ప్రారంభించిన నాలుగు వారాల తర్వాత సస్పెండ్ చేశారు. అమెజాన్ బ్లాక్‌లిస్ట్ లో పెట్టింది. తన AI ను విడిచిపెట్టమని సూచనలు ఉన్నప్పటికీ, దానిని విస్తరించాలనే పట్టుదలతోఉన్నారు. ఇక నుంటి టెక్ కంపెనీలు తమను ఇంటర్యూల్లో మోసం చేస్తున్న వారిని గుర్తించడానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సిద్ధం చేసుకోవాల్సి వస్తుందేమో?