X

Viral News: పాక్‌లో పడుకుంటే తెల్లారేసరికి భారత్‌లో లేచారు.. ఇది కథ కాదు కన్నీటి వ్యథ!

రాత్రి నిద్రపోయి ఉదయం లేచేసరికి ఆ గ్రామం అంతా వేరే దేశంలో కలిసిపోయింది. అవును మీరు విన్నది నిజమే.. ఆ కథ ఏంటో మీరే తెలుసుకోండి.

FOLLOW US: 

ఆ గ్రామం అంతా గాఢ నిద్రలో ఉంది. అయితే ఉదయం లేచేసరికి వారు పక్క దేశంలో ఉన్నారు? రాత్రికి రాత్రి నిద్రలోనే దేశం దాటేశారు? అవును మీరు విన్నది నిజమే. అసలు ఆ రోజు రాత్రి ఏమైంది? తెలుసుకుందాం రండి.

50 ఏళ్ల క్రితం..

1971 డిసెంబర్ 16.. తుర్‌తుక్ గ్రామ ప్రజలు నిద్రలేచే సరికి వారి పౌరసత్వాలే మారిపోయాయి. భారత్- పాకిస్థాన్ మధ్య నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) మారిపోయింది. దీంతో 350 కుటుంబాల జీవితమే తలకిందులైంది. తుర్‌తుక్ సహా లద్దాఖ్‌లోని నుబ్రా లోయలో ఉన్న మరో మూడు గ్రామాలు 1947 నుంచి పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నాయి. అయితే 1971లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో భారత్ జయకేతనం ఎగురవేసి ఈ గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. దీంతో బాల్టీ వర్గానికి చెందిన ఆ గ్రామవాసులు ఇరు దేశాల మధ్య నలిగిపోయారు.  

ఒక్కొక్కరిది ఒక్కో కథ..

షయోక్ నదీ తీరం ఆవలకి వెళ్లాలంటే 30 నిమిషాల సమయం పడుతుంది. కానీ హజీ షంషేర్ అలీ (86) 50 ఏళ్లుగా దీన్ని దాటలేకపోయాడు. పాకిస్థాన్‌ అధీనంలో ఉన్న గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఉన్న అలీ తమ్ముడు హజీ అబ్దుల్ ఖాదీర్ కూడా ఈ నదికి దాటడానికి అలానే ఎదురుచూస్తున్నాడు. ఈ సోదరులిద్దరూ భారత్- పాక్ యుద్ధం తర్వాత ఇలా చెరో దేశంలో ఇరుక్కుపోయారు.

" ఆ రోజుల్లో చాలా మంది యువకులు చదువు, ఉద్యోగాల కోసం స్కర్దు లేదా లాహోర్ నగరాలకు వెళ్లేవారు. చిన్న పిల్లలు లేదా వయసుపైబడిన వారు మాత్రమే గ్రామాల్లో ఉండేవాళ్లు. అయితే ఆ యుద్ధం ముగిసేసరికి చాలా మంది భార్యలు తమ భర్తలకు, కుమారులు తమ తండ్రులకు, సోదరులు తమ అన్నదమ్ములకు దూరమైపోయారు. యుద్ధ సమయంలో అలీ సోదరుడు ఖాదీర్ స్కర్దులో పనిచేసేవాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అసలు మా బాబాయ్ బతికున్నాడో లేదో కూడా తెలియలేదు. ఆయన భార్య మాతో ఇక్కడే ఉండిపోయారు. ఆయన కోసం ఎంతో కాలం ఎదురుచూశాం. అయితే రేడియోలో మా బాబాయ్ పేరు రావడంతో అతను బతికే ఉన్నాడని తెలిసింది. మా ఆత్మీయులను సరిహద్దు మాకు దూరం చేసింది.                                           "
-    గులామ్ హుస్సేన్ గుల్లీ, హజీ షంషేర్ అలీ కుమారుడు

చాలా కష్టం..

సరిహద్దు అవతల ఉన్న తమ వారి నుంచి అప్పుడప్పుడు లేఖలు వచ్చేవని వారు తెలిపారు. కానీ సరిహద్దు దాటి వెళ్లేందుకు వీసా దొరకడం మాత్రం కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చావు, బతుకుల వార్తలు కూడా ఎన్నో ఎళ్లు గడిచిపోయిన తర్వాత మాత్రమే తమకు అందేవని కన్నీటి పర్యంతమయ్యారు. తన సోదరుడ్ని హత్తుకుని ఎన్నేళ్లు గడిచిపోయిందోనని అలీ ఇప్పటికీ బాధపడుతున్నాడు.

ఇది మరో కథ..

చాలా కుటుంబాలు తమ సొంతవారిని కలుసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాయి. అయితే ఫజిల్ అబ్బాస్ (49)ను మాత్రం అదృష్టం వరించింది. యుద్ధ సమయంలో పాకిస్థాన్‌లో ఉండిపోయిన అతని సోదరుడు మహ్మద్ బాషిర్‌కు ఎట్టకేలకు 2013లో వీసా దొరకింది. దీంతో 42 ఏళ్ల తర్లాత తన కుటుంబాన్ని కలిశాడు. 

" నా సోదరుడి కోసం ఎదురుచూసి మా తండ్రి చనిపోయారు. కానీ నా తల్లి ఎట్టకేలకు తన పెద్ద కొడుకును కలుసుకోగలిగింది. నేను నా అన్నయ్యను కలుసుకున్నాను.                                                                "
-   ఫజిల్ అబ్బాస్

 
అయితే బషిర్‌కు మరోసారి కుటుంబాన్ని కలిసేందుకు వీసా అనుమతి దక్కలేదు. 2016 నుంచి ఇరు ప్రాంతాల వాళ్లు కులుసుకునేందుకు వీసా దొరకలేదని వీరు అంటున్నారు. భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్షీణించిన ప్రతిసారి వీరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇటీవల సాంకేతికత పెరగడంతో తమ కుటంబీకులతో కనీసం మాట్లాడుకోగలుగుతున్నామన్నారు.

Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌ వల్ల మరో వేవ్ వస్తే.. ఇక అంతే'.. కొత్త వేరియంట్‌పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

Also Read: Rajya Sabha: 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. వర్షాకాలంలో తప్పు చేస్తే శీతాకాలంలో శిక్ష!

Also Read: Omicron Variant: సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్.. 'ఒమ్రికాన్' అనుకొని హైఅలర్ట్!

Also Read: Farm Laws Repealed: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. రైతుల హర్షం

Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత

Also Read: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

Also Read: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: India Pakistan Viral news went to sleep in Pakistan woke up in India Indopak

సంబంధిత కథనాలు

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Breaking News Live: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం

Breaking News Live: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్ లో భారీ భూకంపం... 12 మంది మృతి...

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్ లో భారీ భూకంపం... 12 మంది మృతి...

Lata Mangeshkar Health Update: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

Lata Mangeshkar Health Update: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

TS Schools  :  తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!

Prostate Cancer: అబ్బాయిలూ జాగ్రత్త.. పాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Prostate Cancer: అబ్బాయిలూ జాగ్రత్త.. పాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?