Fake paneer is flooding the market   హర్యానాలోని మేవాత్‌లోని జంగి మిల్క్ ప్లాంట్ నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్లకు తరలిస్తున్న  ఫేక్ పనీర్ ను  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారులు దీనిని అడ్డుకున్నారు.   పనీర్ చెడిపోయినట్లు, ఆహారానికి అనువైనది కాదని తెలిసి, ల్యాబ్ టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. ఈ 500 కేజీల పనీర్‌ను నోయిడాలోని భంగేల్‌లోని న్యూ గర్హ్వాల్ డైరీలో స్టోర్ చేసి, మరుసటి రోజు స్థానిక అధికారుల సహాయంతో నాశనం చేశారు. 

Continues below advertisement

ఫేక్ పనీర్ తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో రిఫైన్డ్ ఆయిల్, కెమికల్స్, స్టార్చ్, స్కిమ్ మిల్క్ పౌడర్ వంటివి కలుపుతారు, ఇవి శరీరానికి హానికరం. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం.  దుర్వాసన వచ్చే ఫేక్ పనీర్ బ్యాక్టీరియా పెరిగి, వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ కలిగిస్తుంది. కెమికల్స్, రిఫైన్డ్ ఆయిల్ లివర్‌ను దెబ్బతీసి, జాండిస్, లివర్ ఫెయిల్యూర్ వంటివి కలిగించవచ్చు. స్టార్చ్, సింథటిక్ మెటీరియల్స్ జీర్ణవ్యవస్థను దెబ్బతీసి, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇన్‌ఫెక్షన్లు తెచ్చిపెడతాయి.  దీర్ఘకాలంగా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్, హార్మోనల్ ఇంబాలెన్స్, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. పండుగ సమయంలో ఇటువంటి ప్రొడక్ట్స్ తినడం వల్ల ఆసుపత్రి పాలవడం సాధారణం.

నిపుణులు చెబుతున్నట్లు, ఫేక్ పనీర్‌లో ఫ్యాట్ కంటెంట్ 28% కంటే తక్కువ ఉండటం FSSAI నిబంధనలకు విరుద్ధం, ఇది ఆరోగ్యానికి ముప్పు. పనీర్ కొనడానికి ముందు లేదా తినడానికి ముందు స్వచ్ఛత తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రెష్ పనీర్ మైల్డ్ వాసన, ఫర్మ్ టెక్స్చర్, వైట్ కలర్ కలిగి ఉండాలి. స్టికీగా ఉండటం, అసాధారణ కలర్, దుర్వాసన వస్తే అడల్టరేటెడ్ అని అర్థం. వె 

Continues below advertisement

ఫేక్ పనీర్‌ను  ఇలా గుర్తించండి:

1. వాసన తనిఖీ: ఫ్రెష్ పనీర్ మైల్డ్ మిల్కీ అరోమా కలిగి ఉంటుంది. సౌర్, కెమికల్ లాంటి లేదా స్ట్రాంగ్ వాసన వస్తే ఫేక్.2.  కలర్ చూడండి:  జెన్యూన్ పనీర్ వైట్ లేదా ఆఫ్-వైట్. ఎల్లోయిష్, డల్ లేదా అసమాన కలర్ ఉంటే ఫేక్.3.  టెక్స్చర్ ఫీల్ చేయండి:  రియల్ పనీర్ సాఫ్ట్, స్లైట్లీ స్ప్రింగీ, షేప్ హోల్డ్ చేస్తుంది. స్టికీ, ముషీ లేదా హార్డ్‌గా ఉంటే అడల్టరేటెడ్.4.  వాటర్ టెస్ట్:  చిన్న ముక్కను నీటిలో వేయండి. ఫ్రెష్ పనీర్ నెమ్మదిగా మునిగిపోతుంది. స్టార్చ్, కెమికల్స్, ఆయిల్ ఎక్కువ ఉంటే  తేలుతుంది. 5.   టేస్ట్ చేయండి: రియల్ పనీర్ మైల్డ్, క్రీమీ టేస్ట్. బిట్టర్, సోపీ లేదా కెమికల్ టేస్ట్ వస్తే హెచ్చరిక.6.  ఎక్సెస్ ఆయిల్ చెక్: ప్రెస్ చేసినప్పుడు లేదా వంట చేసినప్పుడు చేసినప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుందా చూడండి, రిఫైన్డ్ ఆయిల్స్ లేదా కెమికల్స్ ఉంటే ఇలా జరుగుతుంది.7.  బ్రాండెడ్ కొనుగోలు బెటర్ : వెరిఫైడ్ షాప్స్ లేదా బ్రాండెడ్ డైరీల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తే బెటర్. స్ట్రీట్ వెండర్లు, అన్‌లేబుల్డ్ ప్రొడక్ట్స్  కొనుగోలు చేయవద్దు. 8.  ఎక్స్‌పైరీ, లేబులింగ్ చెక్:* ప్యాకేజ్డ్ పనీర్‌లో మాన్యుఫాక్చరింగ్, ఎక్స్‌పైరీ డేట్స్ ఉండాలి. మిస్సింగ్ లేబుల్స్   ఉంటే ఫేక్.  ఫేక్ పనీర్‌ కనిపిపిస్తే  ఫిర్యాదులు చేయవచ్చు !

 ఫేక్ పనీర్ ను గుర్తిస్తే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్: 1800-11-2100 కు కాల్ చేయవచ్చు.   ఈమెయిల్  consumeraffairs@fssai.gov.inకు ఫిర్యాదు చేయవచ్చు. ఆన్‌లైన్ కంప్లైంట్ ను https://foodlicensing.fssai.gov.in ఈ అడ్రస్‌లో  “కన్స్యూమర్ కంప్లైంట్స్” వద్ద ఇవ్వచ్చు.