Drunk Man Pets Tiger Offers It Liquor In MP: మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ సమీపంలో 52 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి మద్యం మత్తులో పులిని మచ్చిక చేసుకుని తన మందు బాటిల్ నుంచి తాగించే ప్రయత్నం చేసిన వీడియో వైరల్ అయింది. ఆయన అలా చేసి ఎలాంటి హాని లేకుండా తప్పించుకున్నాడని చెప్పే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు.
ఈ వీడియో లియన్ల వ్యూస్ పొందింది. క్యాప్షన్ ప్రకారం, రాజు పటేల్ పేకాట ఆడి..తాగిన మత్తులో రోడ్ుడపైకి వచ్చాడు. అక్కడ పెద్ద పులి కనిపించగానే, దాన్ని పిల్లిగా భావించి నిమిరాడట. పులి మెడపై చేయి వేసి, తన మందు బాటిల్‌ను ముక్కుకు దగ్గరగా తీసుకెళ్లి తాగించేలా ప్రయత్నం చేశాడట. పులి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా వెళ్లిపోయిందని, రాజు సేఫ్‌గా తప్పించుకున్నాడని వీడియోలు చూసి ప్రచారం చేశారు.
ఫాక్ట్ చెకర్లు విస్తృత ఇన్వెస్టిగేషన్ చేసి, ఈ వీడియో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించిందని నిర్ధారించాయి. నిజమైన సంఘటన జరగలేదు. పెంచ్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రాజ్‌నీష్ కుమార్ సింగ్ ఈ వీడియో రిజర్వ్‌లోని ఏ రోడ్డు నుంచీ కూడా కాదు. అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు అని స్పష్టం చేశారు. 'డీప్‌ఫేక్-ఓ-మీటర్', 'వాసిట్ AI' టూల్స్‌లో వీడియోను టెస్ట్ చే శారు. 100% AI-జెనరేటెడ్‌గా నిర్ధారించాయి. కీఫ్రేమ్‌లు అన్‌నాచురల్ మూవ్‌మెంట్స్ చూపించాయి. పులి ఫేస్, మాన్ హ్యాండ్ మూవ్‌మెంట్స్ సూపర్ రియలిస్టిక్ కానీ ఆర్టిఫిషియల్.
వీడియోలో రోడ్ లైటింగ్, పులి బిహేవియర్ ఎప్పుడూ మానవులకు దగ్గరగా రాదు , మనిషి యాక్షన్స్ అసాధారణంగా ఉన్నాయి. ఈ వీడియోలు వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్‌కు హాని చేస్తాయన్న ఆందోళన కనిపిస్తోంది.