Elon Musk  X suffers massive outage :  ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది, దీనివల్ల వినియోగదారులు యాప్, వెబ్‌సైట్‌లో పేజీలు లోడ్ కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.  డౌన్‌డిటెక్టర్  ప్రకారం  భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, పెరూ, మలేషియా, , జర్మనీ సహా పలు దేశాలలో ఈ సమస్య ఉత్పన్నమయింది.                      

నియోగదారులు X యాప్ మరియు వెబ్‌సైట్‌లో పోస్ట్‌లను చూడలేకపోవడం, కొత్త పోస్ట్‌లను షేర్ చేయలేకపోవడం,   లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది వినియోగదారులు “Something went wrong, try reloading” అనే ఎర్రర్ మెసేజ్‌ను చూశారు. డౌన్‌డిటెక్టర్ డేటా ప్రకారం అత్యధిక సమస్యలు వెబ్‌సైట్‌కు,  తర్వతా  యాప్‌కు,  ఆ తర్వాత సర్వర్ కనెక్షన్‌కు సంబంధించినవిగా అంచనా వేస్తున్నారు. అవుటేజ్‌కు సంబంధించి X లేదా ఎలాన్ మస్క్ నుండి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.                

ఇటీవలి కాలంలో ట్విట్టర్ లో తరచూ సమస్యలు వస్తున్నాయి. ఈ అంశంపై మస్క్ మార్చిలో స్పందించారు. ట్విట్టర్ మీద  సైబర్‌అటాక్ జరుగుతోందని అన్నారు.   “ఒక పెద్ద, సమన్వయ బృందం లేదా ఒక దేశం” చేత సైబర్ అటాక్ జరిగిందని ఆరోపించారు.  , సైబర్‌సెక్యూరిటీ నిపుణులు IP అడ్రస్‌ల ఆధారంగా దాడుల మూలాన్ని ఖచ్చితంగా నిర్ధారించడం కష్టమని,  మస్క్   ఆరోపణలకు ఆధారాలు లేవని నెటిజన్లు తేల్చారు.                     

2025లో X ఇప్పటికే రెండు ప్రధాన అవుటేజ్‌లను ఎదుర్కొంది. మార్చి 10, 2025న, ప్లాట్‌ఫారమ్ 30 నిమిషాల పాటు అందుబాటులో లేకుండా పోయింది.  సెప్టెంబర్ 2024లో ఒక గంటకు పైగా గ్లోబల్ అవుటేజ్ నమోదైంది. మార్చి అవుటేజ్ సమయంలో, డార్క్ స్టార్మ్ టీమ్ అనే హ్యాకింగ్ గ్రూప్ డిడిఓఎస్  అంటే Distributed Denial-of-Service దీనికి తామే బాధ్యులమని ప్రకటించుకుంది.  

  మస్క్ 2022 అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఆ తర్వాత  సుమారు 80 శాతం సిబ్బందిని తొలగించారు.  సాంకేతిక మార్పులు చేశారు. అప్పటి నుంచి ట్విట్టర్ లో రకరకాల సమస్యలు వస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.  ట్విట్టర్ ను ఎక్స్‌ గా మార్చిన తర్వాత ఔటేజ్‌లు పెరుగుతున్నాయి.  మస్క్ ఎప్పటికప్పుడు సైబర్ దాడులని చెబుతున్నారు కానీ ఇలాంటి సైబర్ దాడులను నియంత్రించుకుని .... వినియోగదారులకు మెరగైన సేవలు అందించాల్సిన ఆయన కారణాలు చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వివిధ  రకాల మార్కెటింగ్ లు చేసి పెద్ద ఎత్తున వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.  మరి ఔటేజ్ రాకుండా చూసుకోలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో ఇతర సోషల్ మీడియా ల్లో ఔటేజ్ వస్తే.. అందరూ ట్విట్టర్ కు వస్తారని మీమ్స్ వచ్చేవి ఇప్పుడు.. ఔటేజ్ లు ట్విట్టర్ లోనేపెరిగిపోాయాయి.