Elderly Man Calmly Prepares Khaini While Lying in MRI Machine:  ఎమ్మారై మిషన్ లోకి వెళ్లాలంటే ఎవరైనా టెన్షన్ పడతారు. కానీ ఈ పెద్దాయనకు మాత్రం అవేం లేదు. ఆ మిషన్ మీద పడుకుని చక్కగా ఖైనీ ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ వడియో వైరల్ గా మారింది.   

ఒక వృద్ధుడు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ .. ఎమ్మారై స్కాన్ కోసం ఆసుపత్రిలోని MRI మిషన్‌లోకి వెళ్లాడు. అయితే, స్కాన్ సమయంలో  నిశ్చలంగా ఉండాల్సిన సమయంలో, ఖైనీ నమిలేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ ఘటన  రాజస్థాన్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై భిన్నమైన స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.  ఖైనీ తినాలనే కోరిక ఖైనీ తినేవారికి మాత్రమే  అతని చేష్టలు అర్థమవుతాయని కొంత మంది సెటైర్లువేశారు.  మరికొందరు MRI స్కాన్ సమయంలో ఇటువంటి ప్రవర్తనను అనుమతించిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని విమర్శించారు.   

సాధారణంగా  ఉత్తర భారతదేశంలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఖైనీని విపరీతంగా ఉపయోగిస్తారు. దీన్ని సుదీర్ఘంగా ఉపయోగిస్తే  నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.