Prashant Kishore Earned Rs 241 crore in 3 years:   బిహార్ 2025 ఎన్నికల సందర్భంగా జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్, బిహార్ డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరీపై ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తిగత ఆదాయ వివరాలను ప్రకటించాడు. గత మూడు సంవత్సరాల్లో తeను 241 కోట్ల రూపాయలు సంపాదించానని, వాటిలో 30.95 కోట్లు GST , 20 కోట్లు ఆదాయ పన్నుగా చెల్లించానని తెలిపారు. మొత్తం 98 కోట్లు తన పార్టీకి  విరాళం ఇచ్చానన్నారు. ఒక సందర్భంలో రెండు గంటలకు 11 కోట్లు తీసుకున్నానని కూడా తెలిపారు.  ప్రశాంత్ కిషోర్ ప్రధాన ఆరోపణలు బిహార్ డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరీపై గురించి చేశారు. 1995లో తారాపూర్‌లో జరిగిన ఆరు కుశ్వాహా కుల వ్యక్తుల హత్యల కేసులో  చౌదరీ పేరు నిందితుడిగా  ఉందని కిషోర్ ఆరోపించాడు.  కోర్టులో చౌదరీ తన వయస్సు 14 సంవత్సరాలు   అని తప్పుడు డాక్యుమెంట్లతో  ప్రూవ్ చేసి, బెయిల్ పొందాడని కిషోర్ విమర్శించాడు. అయితే, చౌదరీ 2020 ఎన్నికల అఫిడవిట్‌లో తన వయస్సు 51 సంవత్సరాలు  అని చెప్పాడన్నారు. సమ్రాట్ చౌదరీని వెంటనే డిస్మిస్ చేసి, అరెస్ట్ చేయాలన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారిపై ఆరోపణలు చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ తన ఆదాయ వివరాలు వెల్లడించారు.  

Continues below advertisement

"2021-2024 మధ్య వివిధ రాజకీయ పార్టీలు , కంపెనీలకు కన్సల్టెన్సీ సలహాలు ఇచ్చి 241 కోట్లు సంపాదించాను. వాటిలో 30.95 కోట్లు GST (18%), 20 కోట్లు ఆదాయ పన్నుగా చెల్లించాను. వ్యక్తిగతంగా 98 కోట్లు జన్ సురాజ్ పార్టీకి విరాళం ఇచ్చాను" అని  చెప్పారు.   "నేను దొంగతనం చేయను, సలహా ఇచ్చి డబ్బు తీసుకుంటాను. బిహార్ అభివృద్ధి కోసం పని చేస్తాను" అని కిషోర్ స్పష్టం చేశాడు. పార్టీని నడపడటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని బీజేపీ నేతలు కూడా తిరిగి ఆరోపణలు చేస్తున్నారు. వారికి పీకే ఈ కౌంటర్ ఇచ్చారు.  

కిషోర్ చాలా మంది మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారు.   ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే ,  BJP ఎంపీ సంజయ్ జైస్వాల్‌పై కూడా  అవినీతి ఆరోపణలు చేశారు. పాండే భార్య ఖాతాలో 2.12 కోట్లు డిపాజిట్ అయిన విషయాన్ని ప్రశ్నించాడు. సమ్రాట్ చౌదరీ విద్యార్హతలపై కూడా ప్రశ్నలు వేశారు.  10వ తరగతి పాస్ కాకుండా D-Litt డిగ్రీ ఎలా పొందాడని ప్రశ్నిస్తున్నారు.  ఈ ఆరోపణలు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు NDAపై ఒత్తిడి పెంచాయి.