Bengaluru congestion tax : బెంగళూరు ట్రాఫిక్ గందరగోళానికి తాత్కాలిక పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం  రద్దీ పన్‌‌నును విధించాలని అనుకుంటోంది. ఈ టాక్స్ ప్రధానంగా ఒక్కరు మాత్రమే ఉన్న వాహనాలపై విధించనున్నారు.  ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఉదయం 8-11 గంటల మధ్య, సాయంత్రం 5-8 గంటల మధ్య ఏడు ముఖ్య రోడ్లపై ప్రైవేట్ వాహనాలకు రూ. 50-75 వరకు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు.  ఈ ఫీజు FASTag టెక్నాలజీ ద్వారా వసూలు చేయనున్నారు. ఇది ట్రాఫిక్ తగ్గించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.  బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్  రద్దీ నగరాల్లో ఒకటి. 2007-2020 మధ్య ప్రైవేట్ వాహనాల సంఖ్య 280 శాతం పెరిగింది. బెంగళూరు రోడ్లపై రోజూ 12 మిలియన్ వాహనాలు తిరుగుతున్నాయి.  కానీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ 48 శాతం సామర్థ్ మాత్రమే సామర్థ్యంతో పని చేస్తోంది. దీంతో సిగ్నల్‌ల వద్ద ఆగడం, ఫ్యూయల్ వేస్ట్, టైమ్ లాస్ వల్ల సంవత్సరానికి రూ. 19,725 కోట్ల నష్టం జరుగుతోందని  పరిశోధనల్లో తేలింది. ఈ సమస్యలు పర్యావరణానికి, ఆరోగ్యానికి, ఆర్థికానికి దెబ్బ తీస్తున్నాయి.

రద్దీ ట్యాక్స్ అంటే ?

ఇది పీక్ అవరాల్లో నగరంలోని నిర్దిష్ట ఏరియాలు లేదా రోడ్లలోకి వాహనాలు ప్రవేశించడానికి చెల్లించాల్సిన ఫీజు. ఇది ప్రైవేట్ వాహనాలు తగ్గించి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహిస్తుంది. లండన్  15 యూరోలు , స్టాక్‌హోమ్  లో పది డాలర్లు , సింగపూర్ వంటి నగరాల్లో  అమలు చేస్తున్నారు.  భారతదేశంలో ఢిల్లీ, ముంబైలో ప్రతిపాదనలు  వచ్చినా రాజకీయ వ్యతిరేకతతో విఫలమయ్యాయి. ప్రతిపాదన ప్రకారం రద్దీ ట్యాక్స్ ఏడు రోడ్లలో అమలు చేస్తారు.  బళ్లారి రోడ్, తుమకూరు రోడ్,  మాగడి రోడ్,  మైసూరు రోడ్,  కనకపుర రోడ్, బన్నేర్ ఘట్ట రోడ్,  హోసూరు రోడ్,  ఓల్డ్ మద్రాస్ రోడ్,  ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్ లలో అమలు చేస్తారు.  కార్లు, బైకులకు రూ. 50-75 వరకు  వాహన రకంపై ఆధారపడి చార్జ్ చేస్తారు. ఇది FASTag ద్వారా ఆటోమేటిక్‌గా వసూలు చేస్తారు. టోల్ గేట్‌ల వద్ద లేదా ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ల ద్వారా. మల్టీపుల్ ఎంట్రీలకు మాక్సిమమ్ ఫీజు రూ. 150 వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, కార్‌పూలింగ్ వాహనాలు అటే ఒక్కో కారులో ముగ్గురుపైగా ఉంటే పన్ను విధించరు.  

 బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) అధికారులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఆకర్షణీయంగా మారుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి పన్నుల వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరి కర్ణాటక ప్రతిపాదనలకే సిద్ధమవుతుందా.. అమలు చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.