Trump says lost India and Russia to China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ఒక సంచలనాత్మక పోస్ట్ చేశారు. "మనం భారత్, రష్యాలను అత్యంత లోతైన, చీకటి చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారు దీర్ఘకాలిక, సమృద్ధివంతమైన భవిష్యత్తును కలిగి ఉండాలని కోరుకుంటున్నాను!" అని ఆయన రాశారు.
ట్రంప్ పోస్టులో వ్యంగ్యం ఉందా.. నిరాశ ఉందా ?
ట్రంప్ తన పోస్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ఇటీవల బీజింగ్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమ్మిట్ లో పాల్గొన్నది. ఈ సమ్మిట్‌లో మూడు దేశాల నాయకులు ఒకే వేదికపై తమ దేశాల హకారాన్ని చర్చించారు. ట్రంప్ వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారని కొంత మంది భావిస్తున్నారు. అయినా అమెరికా విదేశాంగ విధానాల వైఫల్యాన్ని సూచిస్తున్నాయని ఎక్కువ మంది భావిస్తున్నారు.
అందర్నీ టారిఫ్‌ల పేరుతో బెదిరిస్తున్న ట్రంప్
రష్యా నుంచి భారత్ అయిల్ కొనుగోలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున సంకాలు విధించారు. దీంతో భారత్ అమెరికాకు దూరమవుతూ వస్తోంది. అదే సమయంలో చైనాకు దగ్గరవుతోంది. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా.. డాలర్ ఆధిపత్యాన్ని గండికొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ట్రంప్ అనుమానిస్తున్నారు. ఆ దేశాల కూటమి విస్తరణ , ఎస్‌సీఓ వంటి సంస్థలు చైనా నాయకత్వంలో బలపడుతున్నాయి. ఇది అమెరికా-కేంద్రీకృత ప్రపంచ వ్యవస్థకు సవాలుగా మారుతోంది. అమెరికా ప్రభావం తగ్గుతోందని.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
చైనాను డార్కెస్ట్ గా అభివర్ణించడంతో ట్రంప్ తీరు స్పష్టం చైనాను ' డార్కెస్ట్‌గా' చిత్రీకరిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగానే భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్, రష్యా, చైనా ప్రభుత్వాల నుంచి అధికారిక స్పందనలు రాలేదు. కొందరు ట్రంప్ వ్యాఖ్యలను వ్యంగ్యంగా చూస్తుండగా, మరికొందరు భౌగోళిక రాజకీయాల్లో మార్పులను గుర్తు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-భారత్ సంబంధాలపై ప్రభావం చూపకపోవచ్చని, కానీ చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో అమెరికా సవాళ్లను హైలెట్ చేస్తున్నాయని విశఅలేషిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న డైనమిక్స్‌ను సూచిస్తున్నాయి. చైనా ఆధిపత్యం పెరుగుతున్న తరుణంలో అమెరికా తన మిత్రులను నిలబెట్టుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ ఘటన భవిష్యత్ అంతర్జాతీయ సంబంధాల్లో అనేక మార్పులకు కారణం కానుంది.