Donald Trump Social Media Accounts:


రెండేళ్లుగా బ్యాన్..


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. చాన్నాళ్ల పాటు ఆయన ఫేస్‌బుక్, యూట్యూబ్ అకౌంట్‌లను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆయన అకౌంట్‌లు యాక్టివ్‌గా లేవు. రెండేళ్ల తరవాత ఈ రెండు అకౌంట్‌లు రీస్టోర్ అయ్యాయి. ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు ట్రంప్. ఆయనకు ఫేస్‌బుక్‌లో 3 కోట్ల మంది, యూట్యూబ్‌లో 26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్ అకౌంట్ రీయాక్టివ్‌ అయినట్టు ట్రంప్‌ పోస్ట్ చేశారు. ""I'M BACK" అంటూ ఓ వీడియో షేర్ చేశారు. 2016లో అధ్యక్ష ఎన్నికల తరవాత కీలక ప్రసంగం చేశారు. ఆ వీడియోలో మొదటి 12 సెకన్లు ఎడిట్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు ట్రంప్. 2021 జనవరి 6 వ తేదీ నుంచి ఆయన అకౌంట్‌లు బ్లాక్‌ అయ్యాయి. ఇన్నాళ్లకు అవి రీస్టోర్ అయ్యాయి. దీనిపై YouTube కీలక ప్రకటన చేసింది. ట్రంప్ అకౌంట్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నామని వెల్లడించింది. 


"ఇవాళ్టి నుంచి డొనాల్డ్ ట్రంప్‌ అకౌంట్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నాం. ఇప్పటి నుంచి ట్రంప్ కొంత కంటెంట్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చు"


- యూట్యూబ్










ఇటీవలే ట్విటర్‌ పునరుద్ధరణ..


అంతకు ముందు ట్విటర్ అకౌంట్‌ను కూడా రీస్టోర్ చేసింది అమెరికా. గతేడాది నవంబర్‌లో ఈ నిషేధం ఎత్తి వేశారు. దాదాపు 22 నెలల తర్వాత ట్విట్టర్ లో మళ్లీ ట్రంప్ ఖాతా శనివారం కనిపించింది. 2021లో జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్ వద్ద హింసను ప్రేరేపించింనందుకు ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేశారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేందుకు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. 15 మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ట్రంప్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి అనుకూలంగా 51.8 శాతం ఓట్లు వచ్చాయి. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేసి, అకౌంట్ పునరుద్ధరించారు. ట్విట్టర్ కి తిరిగి రావడానికి తనకు ఆసక్తి లేదని ట్రంప్ భిన్నంగా స్పందించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అభివృద్ధి చేసిన తన కొత్త ఫ్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇది ట్విట్టర్ కంటే మెరుగ్గా ఉందని ట్రంప్ అన్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. రిపబ్లికన్ యూదుల సంకీర్ణ వార్షిక నాయకత్వ సమావేశంలో ప్యానెల్ ద్వారా ట్విట్టర్‌కు తిరిగి రావాలని అలోచిస్తున్నారా అన్న ప్రశ్నకు " తిరిగి రావడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు," అని అమెరికా మాజీ అధ్యక్షుడు చెప్పారు.


Also Read: Putin Arrest Warrant: ఆ కోర్టు తీర్పు మా దేశంలో చెల్లదు, దీనిపై చర్చ కూడా అనవసరం - ICC తీర్పుపై రష్యా అసహనం