Super Tuesday Polls: ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ ఎన్నికల హడావిడి మొదలైంది. మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధ్యక్ష పోటీలో నిలబడే అభ్యర్థికి ప్రతినిధుల మద్దతు అవసరం. అయితే...ఈ రేసులో ఎవరు ఉండాలన్నది నిర్ణయించేదే Super Tuesday Primaries ఎన్నికలు. ఈ పోల్స్‌లో అటు ట్రంప్‌తో పాటు ఇటు బైడెన్ కూడా భారీ విజయం సాధించారు. చాలా వరకూ రాష్ట్రాల్లో ఇద్దరూ పోటాపోటీగా గెలుపొందారు. భారీగా ప్రతినిధుల మద్దతు సంపాదించుకున్నారు. దాదాపు 16 రాష్ట్రాల్లో ఈ సూపర్ ట్యూస్‌డే పోల్స్ జరిగాయి. ఈ ఎన్నికలతో ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ తప్పదని స్పష్టమైంది. వర్జీనియా, నార్త్ కరోలినా, ఒక్లహోమా, టెన్నెస్సేలో ట్రంప్ క్లీన్ స్వీప్ చేస్తారని అంచనా వేస్తున్నారు. అటు జో బైడెన్‌కి కూడా ఇక్కడ భారీగానే ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. బైడెన్‌పై పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇజ్రాయేల్‌కి మద్దతునివ్వడంపై కొంత మంది మండి పడుతున్నారు. పలు చోట్ల బైడెన్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనల మధ్యే పోల్ కొనసాగింది.
Super Tuesday అంటే ఏంటి..?
సూపర్ ట్యూస్‌డే ప్రైమరీ పోల్ అంటే...దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని ప్రతినిధులు అధ్యక్ష రేసులో అభ్యర్థులకు ఓటు వేస్తారు. ఏ ఇద్దరు ఈ రేసులో ఉండాలో డిసైడ్ చేసేదే ఈ ప్రైమరీ పోల్. దీన్నే primary and caucuses poll కూడా అంటారు. అలబామా, అలస్కా, అర్కన్సాస్, కాలిఫోర్నియా, మైనే, నార్త్ కరోలినా, టెక్సాస్, వర్జీనియా సహా పలు రాష్ట్రాల్లో ఈ పోలింగ్ జరిగింది. అధ్యక్ష ఎన్నికలకు ప్రీక్వెల్ లాంటివి ఈ పోల్స్. నామినేషన్‌లో ఎవరు గెలుస్తారు..అన్నదీ తేల్చేది ఇవే. 2020లో ఈ ప్రైమరీ పోల్స్‌లో జో బైడెన్ Bernie Sanders ని వెనక్కి నెట్టి 10 రాష్ట్రాల్లో విజయం సాధించారు. 2016లో డొనాల్డ్ ట్రంప్ 8 రాష్ట్రాల్లో గెలిచారు. ఈసారి కూడా బైడెన్‌కి గట్టి పోటీ ఇచ్చి ఈ రేసులో నిలబడ్డారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లే ఒబామా ఈ సారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారా..? Democratic Party తరపున జో బైడెన్ స్థానంలో ఆమె పోటీ చేయనున్నారా..? ఇటీవల అమెరికాలో జరిగిన ఓ పోల్‌లో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. Rasmussen Reports పోల్ జరగ్గా డెమొక్రాట్స్‌లో దాదాపు సగం మంది మిషెల్లే ఒబామాకి ఓటు వేశారు. ఈ సారి జో బైడెన్‌ని పక్కన పెట్టి మిషెల్లేకి అవకాశమివ్వాలని సూచించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కి బదులుగా ఇంకెవరిని బరిలోకి దింపితే బాగుంటుందని పోల్ జరిగింది. ఇందులో 48% మంది డెమొక్రాట్‌లు మిషెల్లో ఒబామా పేరు ప్రతిపాదించారు. 38% మంది వ్యతిరేకించారు. కేవలం 33% మంది మాత్రమే ఇది ఎన్నికల ఫలితాల్లో అలజడి సృష్టిస్తుందని వెల్లడించారు. జో బైడెన్‌తో పోల్చి చూస్తే..మిషెల్లే ఒబామాకి 20% ఓట్లు పోల్ అయ్యాయి.
Also Read: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ఇదే! త్వరలోనే అధికారిక ప్రకటన?