Donald Trump is doing election campaigns like political leaders in India : భారత్‌లో ఎన్నికలు అంటే మన రాజకీయ నేతలు సహజంగా చేసే పనులేమీటో గుర్తుకు తెచ్చుకోండి. ఒకటి ప్రచారంలో రోడ్ల పక్కన ఉన్న హోటళ్లకు వెళ్లి దోశలు, చపాతీలు వేయడం చేస్తూంటారు. రోడ్ షోలకు కిక్కిరిసిపోయే జనాలను తరలిస్తూంటారు. తమకు అధికారం రాకపోతే దేశం అయితే దేశం లేకపోతే రాష్ట్రం నాశనమైపోతుందంటారు. ప్రత్యర్థులపై ఊహకందని ఆరోపణలు చేస్తూంటారు. అంతే కాదు ప్రజల్లో విద్వేషం పెంచడానికి.. తమ ఓటు బ్యాంక్ ను మరింత పటిష్ట పరచడానికి చాలా చేస్తారు. ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నారు. చివరికి తన మిత్రుడు ఎలాన్ మస్క్ తో లాటరీలు కూడా ప్రారంభించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ లో ఆయన పని చేసి..కస్టమర్లకు సర్వ్ చేశారు. వారితో ముచ్చటించి తనకు ఓటు వేయమని కోరారు.
అమెరికాలో సహజంగా రోడ్ షోలు నిర్వహించరు. డిబేట్లు నిర్వహిస్తారు. కాన డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారీగా రోడ్ షాలను నిర్వహిస్తున్నారు. విస్తృతంగా ప్రజల్ని సమీకరిస్తున్నారు. తనకు అమెరికా పట్టనంత మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు.
కొత్తగా ఆయన మిత్రుడు ఎలాన్ మస్క్.. లాటరీ కూడా ప్రవేశ పెట్టారు. ట్రంప్‌కు ఓటు వేయండి.. డాలర్లు గెలుచుకోండి అని కాంటెస్ట్ పెట్టారు.
ఇక ట్రంప్ వెనుకబడిపోయారని వస్తున్న వార్తలతో.. కాదు ముందే ఉన్నాయని ఆయన వర్గీయులు సోషల్ మీడియాను హోరెత్తించేలా సర్వేలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ట్రంప్ చేసేవనన్నీ మీడియా స్టంట్లు అని కొంత మంది సాక్ష్యాలు బయట పెడుతున్నారు.
ఎంతైనా ట్రంప్ .. భారతీయ రాజకీయ వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. ఎంత మేర విజయం సాధిస్తారో మరి !