X

Gujarat kidney : కిడ్నీలో రాళ్లు తీయమంటే .. కిడ్నీనే తీసేశాడు ! గుజరాత్‌లో డాక్టర్ పటేల్ నిర్వాకం !

కిడ్నీలో రాళ్లుంటే వాటినే తీసేస్తారు కానీ కిడ్నీని తీసేస్తారా..? కానీ ఆ గుజరాత్ డాక్టర్ పటేల్ కిడ్నీనే తీసేశాడు. చివరికి నష్టపరిహారం చెల్లించాడు.

FOLLOW US: 

కుడి కాలుకి దెబ్బ తగిలితే ఎడమకాలికి ఆపరేషన్ చేసిన వాళ్లను చూశాం..! జబ్బు ఒకటి అయితే మందు మరొకటి ఇచ్చే డాక్టర్లను చూశాం..! కానీ కిడ్నీలో రాళ్లను తీయని అడిగితే ఏకంగా కిడ్నీనే తీసేసే డాక్టర్లను కూడా ఇప్పుడు చూస్తున్నాం..! ఈ డాక్టర్ గుజరాత్‌లో సాక్షాత్కరించారు. ఆయన దెబ్బకు పేషంట్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. చివరికి ఆ డాక్టర్ వైద్యానికి ఆస్పత్రి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 

Also Read : జొమాటోకు తమిళ సెగ.. గంటల్లోనే #Reject_Zomato ట్రెండ్‌

గుజరాత్‌లోని ఖేడా అనే జిల్లాకు చెందిన దేవంద్రభాయ్ రావల్‌కు విపరీతంగా నడుం నొప్పి వచ్చింది. యూరిన్ పాస్ చేయడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సమస్య ఏమిటా అని కే.ఎం.జి జనరల్ హాస్పిటల్‌లో చెక్ చేయించుకున్నాడు. అక్కడి డాక్టర్ శివుభాయ్ పటేల్ దేవంద్రభాయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి కిడ్నీలో రాయి ఉందని తేల్చారు. 14 ఎం.ఎం స్టోన్ ఉందని.. దాన్ని తీసేయాలన్నారు. బాధ ఎక్కువైపోవడంతో కుటుంబసభ్యుల అంగీకారంతో ఓ రోజు ఆపరేషన్ చేయించుకున్నారు. 

Also Read : ఇంజినీరింగ్‌ విద్యార్థులూ రెడీనా? ఆధార్‌ హ్యాకథాన్‌లో ప్రోత్సాహకర బహుమతులు

కిడ్నీలో రాయి తీయించుకుంటే ఓ పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని భావించిన దేవంద్రభాయ్ కుటుంబం ఆపరేషన్ రోజు అందరూ ఆస్పత్రికి వచ్చారు. అందరూ ఆపరేషన్ ధియేటర్ ముందు ఊపిరి బిగపట్టి చూస్తూ ఉన్నారు. సినిమాల్లోగానే ఆపరేషన్ చేసి డాక్టర్ బయటకు వచ్చాడు. కానీ ఆయన చెప్పిన మాట విని..  దేవేంద్రభాయ్ కుటుంబసభ్యులంతా కుప్పకూలిపోయారు. తాపీగా ఆపరేషన్ ధియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్.. "ఆపరేషన్ సక్సెస్ - కిడ్నీ రిమూవ్డ్" అని షేక్ హ్యాండిచ్చాడు. ఆ మాట విని ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. కానీ నిజం తెలిసే సరికి కుప్పకూలిపోయారు. రాళ్లు తీయడానికి ఆపరేషన్ చేసిన డాక్టర్ మొత్తం కిడ్నీనే తీసేశాడు. 

Also Read: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ షాక్.. ఎస్‌బీఐకి భారీ జరిమానా.. ఎందుకంటే..!

దీనిపై దేవంద్రభాయ్ కుటుంబసభ్యులు ఆందోళన చేయడంతో అది పేషంట్ ఆరోగ్యం కోసమే అలా చేశామని కవర్ చేసుకున్నారు. కానీ ఆ కిడ్నీ తీసేయడంతో దేవంద్రభాయ్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించింది. ఆపరేషన్ చేసిన  ఎనిమిది నెలల్లోనే ఆయన చనిపోయారు. దీంతో ఆ ఆస్పత్రిపై దేవేంద్రభాయ్ కుటుంబసభ్యులు వినియోగదారుల కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపి నకోర్టు ఆస్పత్రి యాజమాన్యంతో పాటు వైద్యుడు, సిబ్బంది తప్పిదం వల్లే దేవంద్రభాయ్ చనిపోయాడని నిర్ధారించి... రూ. పదకొండు లక్షల 20వేల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కానీ నిర్లక్ష్యం వల్ల పోయిన ప్రాణం  తిరిగి రాదుగా..? ఇలాంటి తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా ఉండాలని.. మరికొంత మంది ఆస్పత్రి బారిన పడకుండా ఉండాలని దేవంద్రభాయ్ కుటుంబసభ్యులు న్యాయపోరాటం చేశారు.  

Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: gujarat Doctor removes kidney kidney stone kidney hospital

సంబంధిత కథనాలు

East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...

East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

Omicron Cases Tally: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు... 23కి చేరిన మొత్తం కేసులు

Omicron Cases Tally: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు...  23కి చేరిన మొత్తం కేసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?

Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?