Maha Kumbh sensation Monalisa: 2025 మహా కుంభమేళాలో వైరల్ సెన్సేషన్ మోనాలిసాకు సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాను అత్యాచారం ఆరోపణలపై సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హీరోయిన్ కావాలన్న ఆశతో వచ్చిన తన వద్దకు వచ్ిన ఒక చిన్న పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని అతను అనేకసార్లు అత్యాచారం చేశాడని కేసు పెట్టారు. సనోజ్ మిశ్రా నాలుగు సంవత్సరాల కాలంలో తనపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ముంబైలో తన కుటుంబంతో నివసిస్తున్న మిశ్రాను నబీ కరీం పోలీస్ స్టేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో పూసల దండలు అమ్ముకునే యువతి మోనాలిసా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె చిరునవ్వు, కళ్లు చూసి యావత్ దేశం ఆమె మాయలో పడిపోయారు. ఒక్కరాత్రిలోనే మోనాలిసా నేషనల్ ఫేమస్ అయిపోయారు. ఎంతలా అంటే చివరకు ఆమె వ్యాపారం చేసుకోలేకపోయారు. ఆమెతో ఫొటోలు దింగేందుకు భక్తులు, ఇంటర్వ్యూల కోసం మీడియా ఎగబడింది. ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన మోనాలిసా అందానికి యువతరమే కాదు దర్శకులు, సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. ఆమె ఓకే అంటే సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తామంటూ ఆమె వెంట పడ్డారు. అలాంటి వారిలో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఒకరు.
సనోజ్ మిశ్రా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే సినిమాతీస్తున్నారు. ఈ సినిమా ఆమెను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈమేరకు మోనాలిసాను ఆమె ఫ్యామిలీని ఒప్పించారు. రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని ఉంటున్న మోనాలిసా ఇంటికి డైరెక్టర్ సనోజ్ మిశ్రా వెళ్లారు. నటించేందుకు ఆమెతో సంతకాలు తీసుకున్నారు. ఆమెకు ముంబైలో ట్రైనింగ్ ఇస్తున్నారు. వచ్చే నెలలో ప్రారంభించి.. అక్టోబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ లోపే సనోజ్ మిశ్రా అత్యాచారం ఆరోపణలతో అరెస్టు అయ్యాడు.
అతను సినిమా అవకాశాల్ని చూపి యువతుల్ని మోసగించేవాడని భావిస్తున్నారు. దీంతో మోనాలిసా భవిష్యత్ ఏమవుతుందోనని ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.