Weather Report: రానున్న 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు- మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపార్జోయ్ తుఫాన్ ఉత్తరం వైపుకు మళ్లి, వచ్చే 2 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. గంటకు 135-145 కిలోమీట్ల వేగంతో గాలులు వీస్తాయని.. రాబోయే మూడు నాలుగు రోజుల్లో గంటలు 160 కిలో మీటర్ల వేగం వరకూ కొనసాగుతుంనది పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే జూన్ 7వ తేదీన తూర్పు-మధ్య, పశ్చమి-మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతలపై గంటలు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 


సాయంత్రం నాటికి ఈ గాలులు గంటకు 95 నుంచి 105 కిలో మీటర్ల వేగంతో తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే ప్రాంతంలో గంటకు 115 కిలో మీటర్ల వేగంతో.. పశ్చిమ-మధ్య, దక్షిణ అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు, ఉత్తర కేరళ, కర్ణాటక, గోవా తీరాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది.  


41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు


మరోవైపు రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 41°C నుండి 43°C వరకు  స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 39°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఖమ్మం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో 3, 4, 5 రోజులు ఈ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ (3, 4జిల్లాల్లో) జిల్లాల్లో కూడా వడగాలులు వీచే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 49 శాతంగా నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
ఇవాళ 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు, రేపు 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి  జిల్లా వరదరాజపురంలో 43.3°C, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9°C, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7°C, అల్లూరి జిల్లా కొండైగూడెం,తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.6°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు.  17 మండలాల్లో తీవ్రవడగాల్పులు,  161 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు.