దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత కొద్ది రోజులుగా 40 వేల దిగువన వస్తున్న కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 18.17 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 43,263 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బుధవారం 37,875 కేసులతో పోలిస్తే ఇవాళ దాదాపు 6 వేల కేసులు పెరగాయి.  కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల 338 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 4,41,749 మంది కరోనాతో మృతిచెందారు. 


Also Read: New study: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...


కేరళలో కరోనా విలయతాండవం


కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 వేల దిగువన ఉన్న కేసులు తాజాగా మళ్లీ 30 వేలు వచ్చాయి. కేరళలో బుధవారం ఒక్కరోజే 30,196 కేసులు నమోదయ్యాయి. 180 మందికి పైగా మరణించారు. ముంబయిలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 500లకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ముంబయిలో ఈ స్థాయిలో కేసులు రావడం జులై 15 తర్వాత ఇదే తొలిసారి. 


 






Also Read: Medicine From Sky: తెలంగాణలో 'మెడిసన్ ఫ్రం స్కై'.. డ్రోన్ల ద్వారా కోవిడ్‌ వ్యాక్సిన్లు.. నేటి నుంచి ట్రయల్స్


4 లక్షల చేరువలో యాక్టివ్ కేసులు


గత కొన్ని రోజులుగా రికవరీలు అధికంగా ఉన్నాయి. కానీ తాజాగా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య తక్కువగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 40,567 మంది వైరస్‌ నుంచి కోలుకోన్నారు. ఇప్పటివరకు దేశంలో 3.23 కోట్ల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.  రికవరీ రేటు 97.48 శాతం ఉంది. కొత్త కేసులు పెరగడంతో క్రియాశీలక కేసులు మళ్లీ 4 లక్షలకు దగ్గరయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,93,614 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం 86.51 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటి వరకు దేశంలో 71.65 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


 


Also Read: Lokesh Tour Tension : నర్సరావుపేటలో టెన్షన్ టెన్షన్ - లోకేష్‌కు పర్మిషన్ లేదన్న పోలీసులు !