Swarna Kuppam Vision 2029 : చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రేదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజక వర్గం కుప్పంపై దృష్టి సారించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సీఎం స్వర్ణ కుప్పం విజన్ 2029ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాం ప్రసాద్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గు మళ్ళ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్,ప్రభుత్వ విప్, జి డి నెల్లూరు శాసనసభ్యులు డా.వి.ఎం. థామస్, పలమనేరు, చిత్తూరు,చంద్ర గిరి,నగరి, పూతల పట్టు శాసనసభ్యులు అమర నాథ్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
స్వర్ణ కుప్పం విజన్ -2029
ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గం, గుడిపల్లి మండలం ద్రవిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు మ.12.05 గం.లకు చేరుకోగా.. ఆయనకు పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్ణ కుప్పం విజన్ -2029 డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్వర్ణ కుప్పం ప్రధాన ఉద్దేశమిదే
కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఈ రోజు సీఎం విడుదల చేసిన డాక్యుమెంటరీ స్వర్ణ కుప్పం లక్ష్యం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు కుప్పం ప్రాంత సమగ్రాభివృద్ధే దీని ప్రధాన ఉద్దేశం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో సుమారు 3 లక్షల మందికి పైగా ఉపాధి అకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేసినట్టు సమాచారం. పాడి పరిశ్రమ అభివృద్ధికి కుప్పంకు మరో రెండు కొత్త డెయిరీలు తెచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో సుమారు రూ.15వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
చంద్రబాబు షెడ్యూల్ ఇదే
స్వర్ణ కుప్పం డాక్యుమెంటరీ ఆవిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు.. కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం నుండి బయలుదేరి కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చేరుకుంటారు. స్థానికుల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత కంగుంది గ్రామం చేరుకుని కీర్తిశేషులు శ్యామన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కుప్పంలో ని ఎనన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళ్లి మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ద్రవిడ యూనివర్సిటీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాత్రికి అక్కడే బస చేస్తారు. 8వ తేదీ (బుధవారం) ఉదయం 8 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి విశాఖకు వెళ్లనున్నారు.