Cloudburst Near Amarnath Shrine :  భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైన ఒక్క రోజులో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మళ్లీ భారీ వర్షాలు పడటంతో కొండలపై నుంచి వరద దిగువకు జారుతోంది. ఇప్పటికే పదమూడు మంది చనిపోయారు. ఆలయం దగ్గర భక్తులు వేసుకున్న టెంట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో పెద్ద ఎత్తున బలగాలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించాయి. ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకూ ఎవరికీ గాయాలు కూడా కాలేదని తెలుస్తోంది. 


 







జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా మంగళవారం యాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పహల్గామ్‌, బల్తాన్‌ రూట్లలోని క్యాంపుల వద్దనే యాత్రికులను ఆపేశారు.  వాతావరణం మెరుగుపడటంతో బుధవారం ఉదయం యాత్రను తిరిగి ప్రారంభించారు. అమరనాథ్‌ యాత్ర సోమవారం నాటికి ఐదో రోజుకు చేరగా.. ఒకే రోజు 19వేల మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర కోసం జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్ర సాగుతున్న కొద్ది యాత్రికుల సంఖ్య పెరుగుతోందని అమర్‌నాథ్‌ క్షేత్ర ట్రస్ట్‌ బోర్డ్‌ తెలిపింది. దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూకు తరలివస్తున్నారు.  అయితే వర్షాలు వారిక ిగండంగా మారాయి. 





అమరనాత్ యాత్ర అత్యంత సంక్లిష్టతతో కూడుకున్నది. అయినా భక్తులు ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తూంటారు. ఒక్కో సారి మంచు ప్రతాపం చూపిస్తూ ఉంటుంది. ఈ సారి భారీ వర్షాలు భక్తులకుపరీక్ష పెడుతున్నాయి.