China Attacks Philippine Navy: చైనా సైన్యం మరోసారి బరితెగించింది. 2020లో భారత సైనికులపై గల్వాన్‌ లోయలో దాడి చేసినట్టు ఈ సారి ఫిలిప్పైన్స్‌ నేవీని టార్గెట్ చేసింది. వీధుల్లో రౌడీల్లా గొడ్డళ్లు, సుత్తులతో ఫిలిప్పైన్స్‌ నేవీకి చెందిన పడవలపై దాడి ధ్వంసం చేశారు చైనా సైనికులు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫిలిప్పైన్స్‌పై జరిగిన ఈ దాడిని భారతీయులు తీవ్రంగా ఖండించారు. "గల్వాన్ 2.0" అని (Galwan Attack 2020) మండి పడుతున్నారు. ఇరువైపులా చాలా సేపటి వరకూ ఉద్రిక్తత నెలకొంది. సైరన్‌లు మోగించుకుంటూ దాడులకు తెగబడ్డారు. ఫిలిప్పైన్ నేవీ సిబ్బందిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పడవల్ని ధ్వంసం చేయడంతో పాటు రైఫిల్స్‌నీ స్వాధీనం చేసుకున్నారు చైనా సైనికులు. వాటితో పాటు నేవిగేషన్ ఎక్విప్‌మెంట్‌నీ ఎత్తుకెళ్లారు.





ఫిలిప్పైన్స్ మిలిటరీ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే..చైనా సైనికులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. South China Sea వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. చైనా పొరుగున ఉన్న ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాంతో విభేదాలు తలెత్తుతున్నాయి. పూర్తిగా ఈ సముద్రంపై పెత్తనం కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే ఇదో ఎడతెగని వివాదమైంది. ఈ సారి ఏకంగా బాహాబాహీ యుద్ధానికి దిగడం ఆందోళన కలిగిస్తోంది. కావాలనే చైనా కవ్విస్తోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. చైనాలోకి వచ్చే ఏ దేశ ఓడనైనా సీజ్ చేసే హక్కు కల్పించేలా ఆ దేశం ఓ చట్టాన్నీ తయారు చేసుకుంది. 2021 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.