Chief Minister Patel has reshuffled the entire Gujarat cabinet: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం రాత్రి పూర్తి కేబినెట్ మార్పులు చేసింది.   రాజ్యసభలో బీజేపీ బలాలు పెరగడం, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కొత్త ఊపు కల్పించడం, యువకులకు అవకాశాలు ఇవ్వడం వంటి కారణాల వల్ల ఈ పెద్ద మార్పు జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.  ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, డప్యూటీ సీఎం కనుబాబా పాటీల్‌తో పాటు, 27 మంత్రులు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పునర్వ్యవస్థీకరణలో OBC, SC/ST, ముస్లిం సముదాయాల నుంచి ప్రాతినిధ్యం పెంచారు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. 

Continues below advertisement

ఈ మార్పులతో గుజరాత్ ప్రభుత్వం కొత్త శక్తిని పొందినట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. "రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపు, ప్రజలకు మరింత సేవలు అందించడానికి ఈ మార్పులు" అని ఆయన తెలిపారు. ఈ కేబినెట్‌లో మహిళల ప్రాతినిధ్యం 4 మందితో పెరిగింది, యువ మంత్రులు 10 మంది చేరారు.  రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ బలాన్ని పెంచుకోవడానికి ఈ మార్పులు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్‌లో బీజేపీ ఆధిపత్యం ఉన్నప్పటికీ, కొత్త ముఖాలను చేర్చడం ద్వారా పార్టీ శ్రేణులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ మార్పులు చేసారు.   

 OBC, SC/ST వర్గాల నుంచి మంత్రులను చేర్చడం ద్వారా సామాజిక సమతుల్యతను సాధించే ప్రయత్నం జరిగింది. ఈ విస్తరణలో మహిళలు, యువత ప్రాతినిధ్యం పెంచారు.   ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులకు కొత్త ఊపు తీసుకొచ్చేందుకు కొత్త మంత్రులను నియమించారు. పాత మంత్రుల స్థానంలో కొత్త వారిని తీసుకొచ్చి, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఉంది. బీజేపీలో అంతర్గతంగా నాయకత్వ మార్పులు, విభాగాల సమన్వయం,  కొత్త నాయకులకు అవకాశం కల్పించడం కోసం ఈ మార్పులుచేశారు.  

కొత్త మంత్రులను నియమించడం ద్వారా ప్రజలకు మరింత సమీపంగా ఉండేలా, వారి సమస్యలను పరిష్కరించేందుకు కొత్త శక్తిని తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది.  ఈ విస్తరణ మరియు పునర్వ్యవస్థీకరణ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రాజకీయంగా, సామాజికంగా, మరియు పరిపాలనాపరంగా బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుదీర్గకాలంగా బీజేపీ గుజరాత్ లో గెలుస్తూ వస్తోంది. అందుకే ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా.. ఎప్పటికప్పుడు పాలనలో కొత్తదనం చూపించందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు.