Chhattisgarh Train Accident Passenger Train Collides With Goods Train: చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు దుర్ఘటన జరిగింది. హౌరా మార్గంలో జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఒక గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కనీసం 6 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. దుర్ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బిలాస్పూర్-కోర్బా మార్గంపై ప్రయాణిస్తున్న కోర్బా ప్యాసింజర్ ట్రైన్ (బిలాస్పూర్ నుండి కోర్బా వైపు)నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్ ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతను గూడ్స్ ట్రైన్ పైకి.. ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేసింది. ఈ ట్రైన్‌లో స్థానిక ప్రయాణికులు, కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మొదటి కోచ్ మాల్ ట్రైన్ మీద ఎక్కింది. అనేక కోచ్‌లు డిరైల్ అయ్యాయి. కంపార్ట్‌మెంట్లు, చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఈ మార్గం చత్తీస్‌గఢ్‌లోని ప్రధాన రైలు లైన్‌లలో ఒకటి, రోజుకు వందలాది ట్రైన్‌లు ప్రయాణిస్తాయి. ముఖ్యంగా గూడ్స్ ట్రైన్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్యాసింజర్ ట్రైన్‌లు ఆలస్యం కావడం సాధారణం. అనేక మంది గాయపడ్డారు, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) అధికారులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు స్థలానికి చేరుకుని రెస్క్యూ పనులు చేపట్టాయి. బిలాస్పూర్ , పొర్వాటి జిల్లాల నుండి మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసు, ఫైర్ డిపార్ట్‌మెంట్, NDRF బృందాలు సహాయం అందిస్తున్నాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు మార్చారు. రైల్వే అధికారుల ప్రకారం, ట్రాక్‌లు క్లియర్ చేసి ట్రాఫిక్ పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. SECR సీనియర్ అధికారులు స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. సిగ్నల్ లోపం, డ్రైవర్ తప్పిదం లేదా మాల్ ట్రైన్ స్థిరంగా ఉండటం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానాలు. SECR దర్యాప్తు టీం ఏర్పాటు చేసింది. రైల్వే బోర్డు స్థాయిలో కూడా పరిశీలన జరుగనుంది.