Chennai woman sent hoax bomb threats to frame man for refusing to marry: ఇటీవల దేశంలో పదకొండు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వెళ్లింది. దీంతో పోలీసులు ఈ కాల్ చేసిన వారిని పట్టుకున్నారు.  ఎందుకిలా చేశారో తెలుసుకని ఆశ్చర్యపోయారు. ఫెయిల్డ్ లవ్ స్టోరీలో.. ఓటీటీ సిరీస్ ను మించి పోయేలా ఆ కథ ఉంది. 

ప్రారంభంలో ఇదో లవ్ స్టోరీ   రెనే జోషిల్డా  అనే 30 ఏళ్ల యువతి చెన్నై నుండి తన ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆపై రోబోటిక్స్‌లో కోర్సు పూర్తి చేసింది.  ఆమె డెలాయిట్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా చెన్నైలో పనిచేస్తోంది. బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ సమయంలో  ఆమెతో కలిసి దివిజ్ ప్రభాకర్‌ అనే వ్యక్తి పనిచేశాడు.  అతనితో ప్రేమలో పడింది. అయితే ాఆ విషయం జోషిల్లా ఎప్పుడూ అతనికి చెప్పలేదు.  దివిజ్  కూడా ఎప్పుడూ ప్రేమ అుకోలేదు.  ఫిబ్రవరిలో దివిజ్ ప్రభాకర్ వేరొకరిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడితో లవ్ స్టోరీ ముగిసింది. ఇక్కడే క్రైమ్ స్టోరీ ప్రారంభమయింది. 

దివీజ్ ప్రభాకర్ జీవితం నాశనం చేయాలనుకున్న జోషిల్లా  

 దివీజ్ ప్రభాకర్ వేరే పెళ్లి చేసుకోవడంతో  రెనే జోషిల్లా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అతని జీవితాన్ని నాశనం చేయాలనుకుంది.  నకిలీ ఇమెయిల్ ఐడిలను - దివిజ్ ప్రభాకర్ పేరుతో సృష్టించింది.   పాఠశాలలు, ఆసుపత్రులు వేదికలకు బాంబు బెదిరింపులు పంపడం ప్రారంభించింది.  రెనే జోషిల్డా అహ్మదాబాద్ , దాని చుట్టుపక్కల 21 ప్రదేశాలను పేల్చివేస్తానన్న బెదిరింపును కూడా పంపింది.   నరేంద్ర మోడీ స్టేడియం, సర్ఖేజ్‌లోని జెనీవా లిబరల్ స్కూల్, ఒక సివిల్ హాస్పిటల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ హెచ్చరికలు సీరియస్ గా ఉండటంతో పోలీసులు లోతుగా ఆరా తీశారు.   

AI 171 ప్రమాదంలో  దివీజ్ పాత్ర ఉందని సమాచారం

జూన్ 12న, ఎయిర్ ఇండియాకు చెందిన అహ్మదాబాద్-లండన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.  ప్రమాదం తర్వాత విమానం కూలిన మెడికల్ కాలేజీకి  ఒక ఇమెయిల్ వచ్చింది. "ఇప్పుడు మీకు మా  శక్తి తెలిసిందని నేను అనుకుంటున్నాను. మేము నిన్న మీకు మెయిల్ పంపినట్లుగా, మేము మా మాజీ ముఖ్యమంత్రి (విజయ్ రూపానీ)తో కలిసి ఎయిర్ ఇండియా విమానాన్ని క్రాష్ చేశాము.."  అని ఈ మెయిల్ సారాంశం.   

చివరికి దర్యాప్తు చేసిన పోలీసులు   రెనే జోషిల్డా తన సాంకేతిక నైపుణ్యం కారణంగా దివీజ్ ను బలి చేసేందుకు బాగా ప్రయత్నించింది.  ఆమె ఇమెయిల్ ఐడీలను సృష్టించడానికి ఉపయోగించే నంబర్ వర్చువల్‌గా ఉంటుంది.  డార్క్ వెబ్ ద్వారా బెదిరింపు ఇమెయిల్‌లను పంపింది. ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది.  చాలా తెలివైనది మ  కానీ ఆమె ఒక చిన్న తప్పు చేసింది. దాంతో దొరికిపోయిందని పోలీసులు తెలిపారు. ఆ తప్పు ఏమిటంటే..  ఒక సందర్భంలో అదే డివైజ్ నుండి ఆమె నిజమైన , నకిలీ ఇమెయిల్ ఖాతాల్లోకి లాగిన్ అయింది.  "ఆ ఒక అజాగ్రత్త లాగిన్ ఆమెను పట్టించింది" అని ఒక పోలీసు అధికారి చెప్పారు. తనను ప్రేమించినట్లుగా కూడా తెలియని ఆ దివిజ్ చివరికి కేసులో ఇరుక్కోకుండా బయటపడ్డాడు.