Chandrababu On National Politics :  దేశ నిర్మాణంలో భాగం అవుతానని అది ఎలా అనేది  కాలమే నిర్ణయిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన జాతీయ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  1980ల నుంచే టీడీపీ జాతీయ కూటమిల్లో భాగంగా ఉందని గుర్తు చేశారు. ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉందన్నారు.  ఇండియా కూటమికి లీడర్ లేకపోవడం బీజేపీ కి అనుకూల అంశమని..  ఇండియా కూటమికి నాయకత్వం ఎవరు వహిస్తారు అనేదానిపై కామెంట్ చేయనని స్పష్టం చేశారు. 


ప్రపంచంలో భారత్‌కు గుర్తింపు తెచ్చిన మోదీ               


ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.  మోడీ భారత్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారున్నారు.  వాజ్ పెయి,మన్మోహన్ సింగ్ అంతగా అంతర్జాతీయ పర్యటనలు చేయలేదని గుర్తు చేసారు.  భారత దేశం టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది.  డీప్ డ్రైవ్ టెక్నాలజీస్ వినియోగంలోకి వస్తున్నాయి. వ్యవసాయం, హెల్త్ రంగాల్లో ఈ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు చూడొచ్చన్నారు.  భారత్ లో అనంతమైన సౌర శక్తి ఉంది. సౌర, పవన విద్యుత్.. సహా భారత్ కి డెమోగ్రఫిక్ సానుకూలత చాలా ఎక్కువ ఉన్నాయన్నారు.  
భారత్ కి యువ శక్తి ఉంది. దేశం అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు పిల్లలు వద్దని అనుకుంటారు. అప్పుడు యువ శక్తి తగ్గుతుంది. అందుకే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనాభా పెరగాలి అని కోరుకుంటున్నా. పిల్లల్ని కనాలి అని ప్రోత్సహిస్తున్నామన్నారు.  పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఉండాలన్నారు. 


భారతీయులను చూసి అమెరికా ప్రజలకు అసూయ              
 
ప్రతి కుటుంబాన్ని మానిటర్ చేసేలా సాంకేతికత వినియోగించుకోవాల్సి ఉందన్నారు.  ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేలా చూడొచ్చన్నారు.  అదాని, అంబానీ, టాటా అంటూ కొందరికే ఆస్తులు సృష్టించడం కంటే ప్రతి కుటుంబం అస్తి సృష్టించే అవకాశం కల్పించాల్సి ఉందన్నారు. ప్రతి భారతీయులు గ్లోబల్ ఆలోచనలు చేస్తారన్నారు.  ఇక్కడ కూర్చుని గ్లోబల్ అవసరాలు తీర్చే ఉద్యోగం చేయవచ్చని..  ఇండియన్ అనేవాడు భూమి మీద ఎక్కడైనా సర్వైవ్ కాగలడు. భారతీయులకు ఉన్న గొప్ప లక్షణం ఎక్కడైనా సర్వైవ్ అవ్వడమేనన్నారు.  జపనీయులు గుంపుగా తప్ప విడిగా బయటకు రారు. భారతీయులు ఏ వాతావరణం అయినా తట్టుకుంటారన్నారు.  ఇండియన్ కల్చర్ బెస్ట్ కల్చర్. భారతీయులను చూసి అమెరికా ప్రజలు అసూయ పడుతున్నారన్నారు. 


రూ. 500 ఆపై నోట్ల రద్దు చేయాలని సూచించాను !              


రూ. 500, ఆపై కరెన్సీ నోట్లను రద్దు చేయాలని సూచించానని చంద్రబాబు గుర్తు చేశారు.  అలా చేస్తే ఎన్నికల్లో నగదు పంపిణీ ఉండదు. మంచి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయన్నారు.  
రాజకీయ అనుభవం ఉన్నవాళ్లెవరూ మోడీని విమర్శించడం లేదని చంద్రబాబు గుర్తు చేశారు.  మోడీ వయసు గురించి మాట్లాడే దమ్ము వైసీపీ వాళ్లకు ఉందా? అని ప్రశ్నించారు.  హైదరాబాద్ అభివృద్ధి పై నాకు ఉన్నంత సంతృప్తి ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు.  ఏపీ, తమిళనాడు లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని..  దక్షిణాది లో కాంగ్రెస్ ఉంది తెలంగాణ, కర్ణాటకలోనేనన్నారు.