News
News
వీడియోలు ఆటలు
X

ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై సుప్రీం కోర్టు తీర్పు, రివ్యూ కోరిన కేంద్రం

Centre Moves Supreme Court: ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రివ్యూ చేయాలని కేంద్రం కోరింది.

FOLLOW US: 
Share:

Centre Moves SC: 

పాలనా వ్యవహారాలపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలుంటాయని గతంలో ఇచ్చిన తీర్పుని రివ్యూ చేయాలంటూ కేంద్రం..సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ జారీ చేసింది. National Capital Civil Service Authority ఏర్పాటు చేయనుంది. అయితే...ఢిల్లీలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలపై ఈ అథారిటీకి అధికారం ఉంటుంది. గ్రూప్ A ఆఫీసర్లను బదిలీ చేసేందుకు వీలవుతుంది. అయితే..సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం...అధికారుల బదిలీ ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. అందుకే..దీనిపై రివ్యూ కోరింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్రానికి అనుకూలంగా తీర్పునిస్తే అప్పుడు సివిల్ సర్వీస్ అథారిటీ ద్వారా తిరిగి అధికారాలు లభిస్తాయి. ఈ అథారిటీకీ సంబంధించిన నిర్ణయాలు అమలు చేయడంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌దే కీలక పాత్ర. ఈ కమిటీలో ఢిల్లీ ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ ఉంటారు. అయినా...లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నిర్ణయమే ఫైనల్ అని ఆ ఆర్డినెన్స్‌లో స్పష్టంగా మెన్షన్ చేసింది కేంద్రం. 

"దేశ రాజధాని ఢిల్లీకి ప్రత్యేక హోదా ఉన్న నేపథ్యంలో స్థానిక, జాతీయ అవసరాలకు అనుగుణంగా పాలనా వ్యవహారాలు సాగాలి. పైగా.. ఢిల్లీ ప్రభుత్వానికి,కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉంటే ప్రజలకూ మంచి సంకేతాలు వెళ్తాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ శాశ్వత కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కి సీఎం సలహాలు ఇవ్వచ్చు"

- కేంద్రం ఆర్డినెన్స్ 

Published at : 20 May 2023 12:01 PM (IST) Tags: ABP Desam Supreme Court Lieutenant Governor Delhi Govt Centre Moves SC Legislative Power Delhi Legislative Power

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 June 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు