Self Enumeration:  దేశవ్యాప్తంగా జరగనున్న  జనగణన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్  సౌకర్యం ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎన్యుమరేటర్ మీ ఇంటికి రాకముందే మీ వివరాలను మీరే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఏప్రిల్ 26  నుండి ప్రారంభమైంది.  

Continues below advertisement

భారతదేశ 16వ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, డేటాలో తప్పులు దొర్లకుండా ఉండేందుకు  సెల్ఫ్ ఎన్యుమరేషన్  విధానాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు  ఏప్రిల్ 26 నుండి మే 10, 2026 వరకు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు.

 నమోదు చేసుకునే విధానం  

Continues below advertisement

1.   ముందుగా అధికారిక వెబ్‌సైట్ [se.census.gov.in](http://se.census.gov.in) ను సందర్శించాలి.2.    మీ రాష్ట్రం (తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్)  జిల్లాను ఎంచుకోండి.3.   మొబైల్ నంబర్ మ,  క్యాప్చా ఎంటర్ చేసి, ఓటీపీ (OTP) ద్వారా వెరిఫై చేయాలి.4.   ఇంటి యజమాని పేరు నమోదు చేసి, భాషను ఎంచుకోవాలి.5.    మీ నివాసం ఎక్కడుందో మ్యాప్‌లో పిన్ చేయాలి. దీనివల్ల ఎన్యుమరేటర్ మీ ఇంటిని గుర్తించడం సులభం అవుతుంది.6.   కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి రకం, తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం, ఇంటర్నెట్, వాహనాలు వంటి వివరాలను నింపాలి.7.   అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత  ఫైనల్ సబ్మిట్ చేయాలి. 8.    సబ్మిట్ చేసిన వెంటనే మీ మొబైల్‌కు ఒక  SE ID (Self Enumeration ID) వస్తుంది. ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది.  

 ఎందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి? ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు గంటల తరబడి వివరాలు చెప్పాల్సిన పని ఉండదు. మీ సమాచారం మీ కళ్ల ముందే నమోదవుతుంది కాబట్టి తప్పులు జరిగే అవకాశం ఉండదు.ఉద్యోగస్తులు, వలస వెళ్లే వారు తమకు వీలైన సమయంలో వివరాలు నమోదు చేయవచ్చు.ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ కాబట్టి డేటా సురక్షితంగా ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు 

* ఒక మొబైల్ నంబర్‌తో ఒక కుటుంబం వివరాలు మాత్రమే నమోదు చేయాలి.* యజమాని పేరును ఒకసారి నమోదు చేశాక మార్చడం సాధ్యం కాదు.* ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత వివరాలను ఎడిట్ చేయలేరు, కాబట్టి జాగ్రత్తగా నింపాలి.* ఆన్‌లైన్‌లో వివరాలు నింపినప్పటికీ, ఎన్యుమరేటర్ ఫిజికల్ వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి వస్తారు. ఆ సమయంలో SE ID ని వారికి అందించాల్సి ఉంటుంది. 

ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించి, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మే 11 నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఈ స్వీయ గణన సౌకర్యాన్ని వినియోగించుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని అధికారులు కోరుతున్నారు.