Celebrities died in plane crashes: భారతదేశంలో జరిగిన గగన తల ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు చనిపోయారు. విమానాలు మాత్రమే కాదు. హెలికాఫ్టర్ ప్రమాదాల్లోనూ వీరు చనిపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవిలో ఉండగానే హెలికాప్టర్ క్రాష్ అయి చనిపోయారు. అంతకు ముందు లోక్ సభ స్పీకర్ గా పని చేసిన జీఎంసీ బాలయోగి కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు.
విమాన ప్రమాదాల్లో అయితే అత్యంత ప్రముఖులు పనిచోయారు. భారత అణు శాస్త్రవేత్తగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన హోమీ జహాంగీర్ భాభా ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణిలో కుప్పకూలిపోవడంతో మరమించారు. ఇది 1966లో జరిగింది. విమానం జెనీవా ఎయిర్ కంట్రోల్‌తో సమాచార లోపం కారణంగా కూలిపోయింది. మొత్తం 117 మంది మరణించారు. హోమీ బాబా మరణం భారత అణు కార్యక్రమానికి ఆటంకం కల్పించింది.
1973లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ప్రమాదంలో కుమార మంగళం బిర్లా చనిపోయారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో స్టీల్ మంత్రిగా ఉన్నారు. 1980లో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్‌కు చెందిన పిట్స్ S-2A గ్లైడర్‌ను నడుపుతూ మరణించారు. అతను ప్రమాదకరమైన మాన్యువర్‌లు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 1994లో పంజాబ్ గవర్నర్ విధులతో పాటు హిమాచల్ ప్రదేశ్ యాక్టింగ్ గవర్నర్ ఉన్న సురేంద్ర నాథ్, తన కుటుంబంలోని 9 మంది సభ్యులతో సహా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సూపర్-కింగ్ విమానంలో ప్రయాణిస్తూ హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వతాల్లో కూలిపోవడంతో మరణించారు.
ఇక కాంగ్రెస్ నాయకుడు , మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా, కాన్పూర్‌కు వెళుతున్న చార్టర్డ్ సెస్నా విమానం యూపీలోని మొయిన్ పురీ సమీపంలో ఒక గ్రామంలో కూలిపోవడంతో మరణించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు , లోక్‌సభ స్పీకర్ జీ.ఎం.సీ. బాలయోగి, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. లోక్‌సభ స్పీకర్‌గా అతని మరణం జాతీయ రాజకీయాలలో గణనీయమైన నష్టం చేసింది. రముఖ దక్షిణ భారత నటి మరియు భారతీయ జనతా పార్టీ సభ్యురాలు సౌందర్య, ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుండి కరీంనగర్‌కు వెళుతున్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హర్యానా పవర్ మంత్రి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ.పి. జిందాల్, హర్యానా వ్యవసాయ మంత్రి సురేంద్ర సింగ్‌తో కలిసి, ఢిల్లీ నుండి చండీగఢ్‌కు వెళుతున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య కారణంగా కూలిపోవడంతో మరణించారు.
ఇక ఏపీ సీఎం హోదాలో ఉన్న వై.ఎస్. రాజశేఖర రెడ్డి, చిత్తూర్ జిల్లాకు వెళుతున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల్ల అడవుల్లో కూలిపోవడంతో మరణించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండూ, పవన్ హన్స్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా, గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధం కోల్పోయిన తర్వాత కూలిపోయింది. ఐదు రోజుల తర్వాత శిథిలాలు కనిపెట్టారు. భారతదేశం యొక్క మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్, తన భార్య మధులికా రావత్‌తో సహా 12 మందితో కలిసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మి-17V5 హెలికాప్టర్ లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.
తాజాగా అహ్మదాబాద్ లో జరిన విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ చనిపోయారు. గుజరాత్ కు 2016-2021 వరకు విజయ్ రూపానీ సీఎంగ వ్యవహరించారు. అలాగే 2004లో అరుణాచల్ ప్రదేశ్ మంత్రి డెరా నటుంగ్, మేఘాలయ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రి సి. సంగ్మా, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.