Bihar Youth Applies Sindoor On Orchestra Dancer Forehead Marries Her On Stage Video Viral: సీనియర్ నరేష్ హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన కనకమహాలక్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమా ఇప్పుడు టీవీల్లో వచ్చినా.. ఓటీటీలో .. యూట్యూబ్ లో చూసినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్క సీన్ కూడా మిస్ కాలేరు. డాన్స్ ట్రూప్ లో డాన్స్ చేసే ఇద్దరి మధ్య లవ్ స్టోరీ..ఇది. ఒకప్పుడు అలాంటి ట్రూప్స్ చాలా ఉండేవి. కానీ ఇప్పుడు తగ్గిపోయాయి. కానీ బీహార్ లో ఇప్పుడు అలాంటి తరం నడుస్తోంది.
ఓ రికార్డింగ్ డాన్స్ ట్రూపు ఓ ఊళ్లో ప్రదర్శన ఇస్తోంది. ఓ చూడచక్కని అమ్మాయి డాన్స్ చేస్తోంది. కాసేపటికి ఓ యువకుడు వెళ్లాడు. ఆమెపై తెల్లటి వస్త్రం కప్పేసి.. నదుటన సింధూరం రాసేశాడు. మొదట ఆ అమ్మాయి అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేసింది. కానీ తర్వాత సిగ్గుపడింది. అతన్ని హగ్ చేసుకుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరూ డాన్స్ ట్రూపులో పని చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ప్రేమించుకుంటూనే ఉంటారు. అయితే కొంత మంది అడ్డం పడుతూంటంతో వారికి బుద్ది చెప్పి.. తాము ఒక్కటవడానికి ఈ డాన్స్ ప్రోగ్రాం వేదికను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
వాలెంటైన్స్ డే రోజున వారు ఇలా పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలాంటి లవ్ స్టోరీలు, పెళ్లిళ్లు ... సక్సెస్ కావని..కాని వీరు మాత్రం సక్సెస్ కావాలని అంటున్నారు. కొంత మంది మాత్రం ఇది మంచి పద్దతి కాదంటున్నారు.