Bihar MP Pappu Yadav controversial comments on women politicians:  వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్, తాజాగా మహిళా రిజర్వేషన్లు, మహిళా నేతలపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.  మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై చర్చ జరుగుతున్న తరుణంలో పప్పూ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి 90 శాతం మంది మహిళలు రాజకీయ నాయకుల గదుల్లోకి వెళ్లకుండా రాజకీయం చేయలేరు అని వ్యాఖ్యనించి దుమారం రేపారు.

Continues below advertisement

పప్పు యాదవ్ సంచలన ఆరోపణలు

భారతదేశంలో మహిళలను దేవతలుగా కొలుస్తారని, కానీ వాస్తవంలో వారికి ఇక్కడ ఎప్పటికీ గౌరవం దక్కదని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు. దీనికి వ్యవస్థ , సమాజమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. అయితే, చర్చను మరింత వివాదంలోకి నెట్టిన అంశం ఏమిటంటే—రాజకీయాల్లోకి వచ్చే మహిళల్లో అత్యధికులు 90 శాతం  నాయకుల ప్రసన్నం కోసం వారి  బెడ్ రూమ్ వరకు వెళ్లాల్సి వస్తోందని, అలా చేయనిదే వారికి అవకాశాలు రావడం లేదని ఆయన చేసిన   వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి.  

Continues below advertisement

తన వ్యాఖ్యలను సమర్థించుకున్న పప్పు యాదవ్ పప్పు యాదవ్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, తాను వ్యవస్థలోని కుళ్లును ఎండగడుతున్నానని చెబుతున్నారు. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎంత దారుణంగా ఉందో చెప్పడమే తన ఉద్దేశమని ఆయన అంటున్నప్పటికీ, ఆయన వాడిన భాష మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న మహిళా నేతలందరినీ కించపరిచే విధంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మహిళల పోరాటాన్ని, వారి ప్రతిభను తక్కువ చేస్తూ, వారి ఎదుగుదలకు కేవలం  అనుకూలతలు మాత్రమే కారణమని చిత్రీకరించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

 రిజర్వేషన్లపై  కోటాలో కోటా వాదన

మహిళా రిజర్వేషన్ల విషయంలో పప్పు యాదవ్ మొదటి నుంచీ ఒక ప్రత్యేక వాదన వినిపిస్తున్నారు. రిజర్వేషన్లు కేవలం ఉన్నత వర్గాల మహిళలకే  పరిమితం కాకూడదని, అందులో ఓబీసీ, దళిత మరియు మైనారిటీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో, కేవలం నగరాల్లో ఉండే గ్లామరస్ మహిళలే చట్టసభలకు వస్తారని, గ్రామీణ మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వాదనను వినిపించే క్రమంలో ఆయన వాడుతున్న పదజాలం మహిళా ద్వేషపూరితం  గా ఉందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.   

 రాజకీయ పార్టీల ఆగ్రహం

పప్పు యాదవ్ వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీల మహిళా నేతలు ఏకమై నిరసన తెలుపుతున్నారు.  0 శాతం మహిళలను అవమానించే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?" అని మహిళా ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళా శక్తిని కించపరచడమే కాకుండా, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతుల్లో భయాందోళనలు సృష్టిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని వివరణ కోరింది. 

పప్పు యాదవ్ ఇప్పుడే కాదు..  ఆయన మాట్లాడిన ప్రతీసారి వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన ఇప్పుడు పూర్ణియా నుంచి కాంగ్రెస్ మద్దతు తో ఇండిపెండెట్ గా గెలుస్తూ వస్తున్నారు.