Bihar Groom Dance:  ఆ పెళ్లి కొడుకుకు కాక కాక పెళ్లి అవుతోంది.  ధూమ్ థామ్‌గా పెళ్లి జరగాలని డాన్సులేసే టీమును డబ్బులిచ్చి ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ అలా చేయడమే అతని పెళ్లి  ఆపేస్తుందని తర్వాత తెలిసింది.                       

బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో వివాహ మండపం నుండి వరుడిని కొంత మంది అపహరించారు. ఈ ఘటన మే 24, 2025 రాత్రి 2 గంటల సమయంలో నగర్ థానా పరిధిలోని సాధు చౌక్ మొహల్లాలో జరిగింది. వరుడి అపహరణకు బారాత్‌లో వినోదం కోసం పిలిచిన డాన్స్ టీమ్ కారణమని పోలీసులకు ఫిర్యాదులు అందాయి.                   

బైకుంఠపూర్ థానా పరిధిలోని దిఘ్వా దుబౌలీ నుండి సురేంద్ర శర్మ కుమార్తె వివాహం కోసం సాధు చౌక్ మొహల్లాకు బారాత్ వచ్చింది. వివాహ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి,.బారాతీల వినోదం కోసం  డాన్స్‌లు వేసే వారిని పిలిచారు. డాన్స్  కార్యక్రమం సందర్భంగా, కొందరు స్థానిక యువకులతో ఏదో విషయంపై గొడవపడ్డారు. అది క్రమంగా హింసాత్మకంగా మారింది.                                

వివాదం తీవ్రమవడంతో డాన్స్ చేసే టీమ్‌లోని వారు  వధువు ఇంటి వద్దకు చేరుకుని, అక్కడ ఉన్న వారిపై దాడి చేశారు. వధువు, ఆమె తల్లి విద్యావతి దేవితో సహా అనేక మంది మహిళలు గాయపడ్డారు.  దాడి చేసిన వారు ఇంట్లోకి చొరబడి ఆభరణాలు, విలువైన వస్తువులు మరియు వధువు వివాహం కోసం సిద్ధం చేసిన ఖరీదైన దస్తులను దోచుకెళ్లారు. ఈ గొడవను ఆపి హీరో అవ్వాలని వరుడు ప్రయత్నించాడు. కానీ  కానీ దాడి చేసిన వారు అతన్ని కొట్టి, బలవంతంగా ఒక వాహనంలో ఎక్కించి  తీసుకెళ్లిపోయారు.  

 ఘటన సమాచారం అందిన వెంటనే నగర్ థానా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు, కానీ అప్పటికే దోపిడీ చేసిన వారు పరారయ్యారు.   వరుడిని సురక్షితంగా విడిపించడానికి   పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వస్తువులన్నీ పోతే పోయాయి అనుకుంటే వరుడ్ని కూడా తీసుకెళ్లిపోవడంతో  వధువు తీవ్ర షాక్ కు గురయింది. ఆమె పదేపదే స్పృహ కోల్పోతోంది.  

డాన్స్ చేయడానికి వచ్చిన  వారిలో  ట్రాన్స్‌జెండర్ సభ్యులు ఉన్నారని వారి వల్ల గొడవ జరిగిందని అంటున్నారు.