విడిపోతున్నట్టు లీగల్ డాక్యుమెంట్ కావాలి..


రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి బిహార్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా సరే, సంబంధింత విభాగాల అధికారులతో మాట్లాడి, వారి అనుమతి తీసుకుని ఆ తరవాత పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ  వెంటనే తమ మారిటల్ స్టేటస్‌ వివరాలు తెలియ జేయాలని స్పష్టం చేసింది. రెండో  వివాహం చేసుకోవాలనుకుంటే మొదటి భర్త లేదా భార్య నుంచి విడిపోతున్నట్టుగా లీగల్ డాక్యుమెంట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. తరవాత సంబంధిత విభాగానికి తెలియజేయాలి.


అనుమతి తీసుకోకపోతే అవన్నీ బంద్.. 


ఒకవేళ మొదటి భర్త లేదా భార్యకు సమాచారం ఇవ్వకపోయినా, వాళ్లు అభ్యంతరం తెలిపినా, రెండో వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం తరపున వచ్చే ఏ బెనిఫిట్స్ కూడా  రావని స్పష్టం చేసింది. ఈ నిబంధన పురుషులతో పాటు మహిళలకీ వర్తిస్తుంది. అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకున్న వాళ్లు సర్వీసులో ఉండగా హఠాన్మరణం చెందితే,వాళ్ల భర్త లేదా భార్యకు గానీ, వాళ్ల సంతానానికి గానీ కారుణ్య నియామకం వర్తించదు. అంటే...కారుణ్య నియామకం కింద వారికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించదు. ఇలాంటి సమయంలో మొదటి భార్య లేదా భర్త సంతానానికే ప్రాధాన్యతనిస్తారు. వెంటనే ఈ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డివిజనల్ కమిషనర్స్‌, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌లు, డీజీపీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.