Rahul Gandhi Open Letter:


పంజాబ్‌లో యాత్ర..


రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాత్రలో ఎదురైన అనుభవాలన్నింటినీ కలిపి రాహుల్ ఓ పెద్ద లెటర్ రాశారు. వ్యక్తిగత, రాజకీయ లక్ష్యాలేంటో ఇందులోనే చెప్పారు. 


"భారత్‌ జోడో యాత్ర ద్వారా నాకో విషయం అర్థమైంది. నా వ్యక్తిగత, రాజకీయ లక్ష్యం ఒక్కటే. బలహీన వర్గాలకు అండగా నిలబడాలి. వాళ్ల హక్కుల్ని కాపాడాలి. వాళ్ల గొంతుకనవ్వాలి" 


- రాహుల్ గాంధీ


దీంతో పాటు మరి కొన్ని కీలక విషయాలనూ ఈ లెటర్‌లో పంచుకున్నారు రాహుల్ గాంధీ. తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఏమేం చేయాలనుకుంటున్నారో కూడా స్పష్టతనిచ్చారు. 


"నా దేశాన్ని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకురావాలన్నదే నా లక్ష్యం. విద్వేషాలు పోయి అంతటా ప్రేమ వ్యాప్తి చెందాలి. అందరిలోనూ నిరాశ పోయి నమ్మకం రావాలి. ఈ లక్ష్యం సాధించేందుకు నా విలువలు, సిద్ధాంతాల ఆధారంగా ముందుకు వెళ్తాను. భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయులే నాకు ఆదర్శం" 


- రాహుల్ గాంధీ 




భరోసా..


దేశంలో ఆర్థిక సంక్షోభం ఉందని, యువత నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ద్రవ్యోల్బణమూ తారస్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలే కనిపిస్తున్నాయని ఈ లెటర్‌లో ప్రస్తావించారు. ఓ మతాలు, కులాలు, భాషల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ఈ విద్వేషాలు తొలగిపోతాయని ఆకాంక్షించారు. ఈ సమస్యలపై కచ్చితంగా ప్రజలతో చర్చిస్తామని వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, మనసులోని భయాన్ని తీసేస్తే తప్పకుండా విద్వేషం మన నుంచి దూరమవుతుందని సూచించారు. ప్రతిరోజు ఈ సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ సమానావకాశాలు లభించే నవ భారత దేశాన్ని నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు దక్కేలా చూస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గేలా చొరవ తీసుకుంటామని తెలిపారు. 


రాహుల్ పీఎం అభ్యర్థి కాదు: జైరాం రమేశ్ 


జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ని పీఎం క్యాండిడేట్‌గా చూపించాలన్న ఉద్దేశంతో ఈ యాత్ర చేయడం లేని స్పష్టం చేశారు. "రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం  భారత్ జోడో యాత్ర ఉద్దేశం కానే కాదు" అని వెల్లడించారు. దేశాన్ని జోడించేందుకు జరుగుతున్న ఈ యాత్రకు రాహుల్‌ ఓ సారథి మాత్రమేనని అన్నారు. ఇది కేవలం ఒక్కరి కోసం జరుగుతున్న యాత్ర కాదని తెలిపారు.  కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ సాగే ఈ యాత్రలో రాహుల్ ఎన్నో సమస్యలను చర్చించారని అన్నారు జైరాం రమేశ్. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, రాహుల్ ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు రాహుల్ పీఎం అభ్యర్థి అంటూ కొందరు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో...జైరాం రమేశ్ స్పష్టతనిచ్చారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో  2024 ఎన్నికల పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ స్పష్టం చేశారు. 


Also Read: Rapido Bike Taxi: ర్యాపిడోకి షాక్ ఇచ్చిన కోర్టు, సర్వీస్‌లు నిలిపివేయాలంటూ ఆదేశాలు