Besharam Rang Row: కింగ్ ఖాన్ షారూక్, హాట్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన 'పఠాన్' సినిమాపై విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే 'బేషరం రంగ్'పై హిందూ సంఘాలతో పాటు భాజపా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 'పఠాన్' చిత్రంపై మధ్యప్రదేశ్ స్పీకర్ గిరీశ్ గౌతమ్ విమర్శలు చేశారు. షారూక్ ఖాన్‌కు సవాల్ విసిరారు.
అంతకుముందు
'బేషరం రంగ్' పాటపై అంతకుముందు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదీ వివాదం
వచ్చే జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న పఠాన్ మూవీపై దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలోని బేషరం రంగ్ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'బాయ్‌కాట్ పఠాన్' హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి.
ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. ఆ సాంగ్‌లో దీపిక, షారూక్ ధరించిన దుస్తుల్ని తప్పుపడుతున్నారు.
అయితే ఈ వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. సినిమా యూనిట్‌కు మద్దతు తెలిపారు.
'పఠాన్' సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా ట్రైలర్ పై కూడా నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. ఈ సినిమా హాలీవుడ్ వార్ అండ్ మార్వెల్స్ కు కాపీ లా ఉందని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ మూవీను బ్యాన్ చేయాలంటూ కూడా కామెంట్లు వచ్చాయి. తర్వాత 'బేషరమ్ రంగ్' పాటపై కూడా ఇదే రీతిలో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పాటలో షారుక్-దీపికా కెమిస్ట్రీ బాగుందని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది సినిమా పబ్లిసిటీ కోసం మరీ ఇంత బోల్డ్ గా చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Viral News: రైల్వేశాఖ నిర్లక్ష్యం- ఆమ్లెట్లో బొద్దింక ప్రత్యక్షం, ఫొటోలు వైరల్!