Bengaluru techie ordering food through Zomato on train Iam taking revenge: ఓ వ్యక్తి జొమాటోలో ఆర్డర్ చేయడం ఆ కంపెనీకి మేలు చేయడం అవుతుంది కానీ రివెంజ్ తీర్చుకోవడం అవుతుందా ?. కొన్ని సార్లు అవుతుంది. ఈ విషయాన్ని బెంగళూరు టెకీ ఒకరు చేసి చూపించారు.
సన్నీ గుప్తా ముంబై నుంచి పుణెకు రైల్లో వెళ్తున్నారు. లంచ్ కోసం ఆయన రైల్లోనే వెండర్ కు ఆర్డర్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన ఫోన్‌లో కాసేపటికి ఓ నోటిఫికేషన్ వచ్చింది. అదేమింటే..ఇప్పుడు ట్రైన్ జర్నీలో కూడా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చని ఆ నోటిఫికేషన్ సారాంశం. వెంటనే జొమాటో ఓపెన్ చేశాడు. పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు అప్ కమింగ్ స్టేషన్‌లో ఎక్కడ కావాలంటే ఫుడ్ డెలివరీ తీసుకోవచ్చు. గుప్తా పన్వెల్ స్టేషన్‌లో డెలివరీ ఇచ్చేలా షెజువార్ రైస్ ను ఆర్డర్ పెట్టుకున్నారు.
ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. జొమాటోపై మొదటిసారి రివెంజ్ తీర్చుకుంటున్నానని పోస్టు పెట్టారు. ఎందుకంటే ఆ ట్రైన్ ఆలస్యంగా నడుస్తోంది మరి.
అయితే ట్రైన్ ఎంత ఆలస్యం అయినా జొమాటో డెలివరీ బాయ్ తెచ్చాడని గుప్తా సంతృప్తి వ్యక్తం చేశారు. గుప్తా ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. గుప్తా కూడా కదులుతున్న రైల్లో ఫుడ్ డెలివరీ చేయడం చాలా మంది ప్రయత్నమన్నారు.
ఇతరులు కూడా జొమాటో ఈ ట్వీట్ వల్ల సంతోషంగా ఉటుందని చెప్పుకొచ్చారు. ఇది స్వీట్ రివెంజ్ అనుకోవచ్చని సెటైర్లు వేశారు.