Bengaluru techie caught watching Netflix What next:  బెంగళూరు టెక్కీల తెలివితేటల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ, ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేసిన పని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫీసులో పని చేస్తూ 'నెట్‌ఫ్లిక్స్' చూస్తూ బాస్‌కు దొరికిపోయిన ఈ  ఉద్యోగి  చేసిన ఆవిష్కరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.                               సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో టెక్కీలు ఏదైనా సాధించగలరని మరోసారి నిరూపితమైంది. అయితే ఈసారి అది ప్రాజెక్ట్ డెడ్ లైన్ కోసం కాదు.. తన  ఎంటర్టైన్మెంట్ ను కాపాడుకోవడం కోసం! ఆఫీసులో బాస్ కళ్లుగప్పి సీక్రెట్‌గా సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఒక టెక్కీ సరికొత్త గ్యాడ్జెట్‌ను కనిపెట్టాడు.                       కొన్ని రోజుల క్రితం సదరు టెక్ నిపుణుడు తన డెస్క్ వద్ద కూర్చుని లీనమైపోయి  నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నాడు. అయితే అనుకోకుండా వెనుక నుంచి వచ్చిన బాస్, ఆ స్క్రీన్‌ను చూసి స్టన్ అయ్యారు. ఆ సమయంలో ఆ టెక్కీకి పడ్డ తిట్లు అన్నీ ఇన్నీ కావు. బుద్ది ఉన్న ఉద్యోగి అయితే మరోసారి ఆ పని చేయడు. కానీ ఆ ఉద్యోగికి అలాంటి ఆలోచన రాలేదు. బాస్ కు తెలియకుండా ఎలా నెట్ ఫ్లిక్స్ చూడాలా అని ఆలోచించాడు.  ఒక అద్భుతమైన ' ఆలోచన పుట్టించుకున్నాడు. మళ్లీ ఎప్పుడూ ఇలా బాస్‌కు దొరకూడదని నిర్ణయించుకున్న అతను, తన కోడింగ్ నైపుణ్యానికి కాస్త సెన్సార్లను రెడీ చేసుకున్నాయి. ఈ సెన్సార్ ..బాస్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా..  కంప్యూటర్ స్క్రీన్‌ను మార్చేస్తుంది. 

Continues below advertisement

ఎలా పనిచేస్తుంది?             

అతను ఒక చిన్న డిటెక్షన్ డివైజ్‌ ను తయారు చేసి తన క్యాబిన్ ఎంట్రన్స్‌ వద్ద అమర్చాడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మోషన్ సెన్సార్ల సహాయంతో పనిచేస్తుంది. ఆఫీసు కారిడార్‌లో బాస్ రాకను ఈ పరికరం ముందే గుర్తిస్తుంది. బాస్ తన డెస్క్ వైపు వస్తున్నాడని తెలియగానే, కంప్యూటర్ స్క్రీన్‌పై ఉన్న నెట్‌ఫ్లిక్స్ విండో దానంతట అదే మినిమైజ్ అయిపోయి.. దాని స్థానంలో సీరియస్ కోడింగ్ లేదా ఎక్సెల్ షీట్ ప్రత్యక్షమవుతుంది.  బాస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా సినిమా ప్లే అవుతుంది.

Continues below advertisement

నెట్టింట వైరల్..  

ఈ వింత ఆవిష్కరణ గురించి అతను సోషల్ మీడియాలో పంచుకోగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  బ్రదర్.. ఈ తెలివితేటలు ఏదో ప్రాజెక్టులో చూపిస్తే ప్రమోషన్ వచ్చేది కదా!  అని కొందరు నవ్వుతుంటే, ప్రతి ఆఫీసులో ఇలాంటి పరికరం ఒకటి ఉండాల్సిందే  అని మరికొందరు టెక్కీలు కామెంట్ చేస్తున్నారు.  ఈ గ్యాడ్జెట్ ఎంత స్మార్ట్ అయినా, బాస్ గనుక ఈ వార్త చూస్తే ఆ టెక్కీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!