Uber Ride Waiting Time:


బెంగళూరులో అంతే మరి..


ట్రాఫిక్ జామ్‌ గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తొచ్చే సిటీ బెంగళూరు. అక్కడి వాళ్లు రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో ట్రాఫిక్‌కి సంబంధించి ఏదో ఓ పోస్ట్ పెడుతూనే ఉంటారు. ఇప్పటికే అక్కడి రద్దీతో విసిగిపోయారు. కొంత మంది బెంగళూరు ట్రాఫిక్‌పై మీమ్స్ కూడా చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బెంగళూరు వాసి ట్విటర్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఊబర్‌లో ఆటో బుక్‌ చేసుకున్న ఆ వ్యక్తి వెయిటింగ్ టైమ్‌ చూసి కళ్లు తేలేశాడు. అదే స్క్రీన్‌షాట్‌ని ట్వీట్ చేశాడు. 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఆటో రావడానికి వెయిటింగ్ టైమ్ 71 నిముషాలు చూపించింది. ఇది చూశాకే ఆ యూర్ షాక్ అయ్యాడు. "అంత దూరం నుంచి శ్రమపడి వస్తే మాత్రం..ఆ ఆటో డ్రైవర్‌కి కచ్చితంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే" అంటూ ఓ కొటేషన్ రాసి పోస్ట్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ట్విటర్ యూజర్స్‌ ఇది చూసి ఆశ్చర్యపోయారు. అందుకే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని మొత్తుకునేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "అన్ని కంపెనీల HRలకు ఈ స్క్రీన్ షాట్ పంపించాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంత బెటరో వాళ్లకు అర్థమైపోతుంది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "నాకు తెలిసినంత వరకూ మనం సిటీలు వదిలేసి పల్లెటూళ్లకు మూవ్ అయిపోవటం మంచిది. టైమ్ వేస్ట్ అవ్వదు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రశాంతంగా బతకొచ్చు. MNCలు ఉద్యోగుల కన్వీనియెన్స్ కోసం అలాంటి ఏర్పాట్లు చేయాలి" అని మరో నెటిజన్ సలహాలిచ్చాడు. అయితే...ఈ రైడ్‌ని యాక్సెప్ట్ చేసిన కాసేపటికే ఆ డ్రైవర్‌ వెయిటింగ్ టైమ్‌ని, దూరాన్ని చూసి వెంటనే ఓ నిముషం తరవాత క్యాన్సిల్ చేశాడు.