Bengaluru belongs to Kannadigas : సోషల్ మీడియాలో కొంత మంది అనాలోచితంగా చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతూంటాయి. ఇతరులు కూడా అంతే ఘాటుగా స్పందించడంతో హాట్ టాపిక్ గా మారిపోతూంటాయి. నిజానికి అలా మాట్లాడటానికి అతనికి రాజ్యాంగపరంగా వచ్చిన వాక్ స్వేచ్చ మాత్రమే ఉంటుంది. కానీ అది అందరికీ వర్తిస్తుందన్నట్లుగా ప్రకటించేయడం వల్లనే సమస్యలు వస్తూంటాయి.
ఇలా సోషల్ మీడియాలో ఓ ట్విట్టర్ యూజర్.. బెంగళూరు కన్నడిగులకు సంబంధించినదేనని.. అక్కడకు వచ్చే వారు ఖచ్చితంగా కన్నడ నేర్చుకోవాలని ఓ ట్వీట్ పెట్టారు. ఆయన ఉద్దేశం కర్ణాటకలో ఉండేవారు కన్నడ భాషను నేర్చుకోవాలని. బెంగళూరు గ్లోబల్ సిటీ కాబట్టి ఎంతో మంది ఉపాధి, ఉద్యోగాల కోసం వస్తూంటారు. అలా వచ్చిన వారందరూ కన్నడ నేర్చుకోవాలని ఆయన డిమాండ్. ఇలా మాట్లాడటానికి అతనికి ఏమైనా అధికారం ఉందా అంటే.. ఉండదు. మన దేశంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు. దానికి భాష ప్రామాణికం కాదు. అయినా అతను.. అలా ట్వీట్ పెట్టే సరికి ఇతరులు ఘాటుగానే స్పందిస్తూ సమాధానాలిస్తూ పోయారు. ఇది అంతకంతకూ పెరిగి వైరల్ అయిపోయింది.
బెంగళూరు నగరంలో ప్రతి దుకాణం ముందు కన్నడ బోర్డు ఉంటుంది. అలాగే అది గ్లోబల్ సిటీ. దేశంలోని అన్ని రాష్ట్రాల వారే కాదు.. విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో నినిసిస్తూ ఉంటారు. సాఫ్ట్ వేర్ క్యాపిటల్ కాబట్టి ఇక వచ్చిపోయేవారు ఎవరెవరో చెప్పడం కష్టం. బెంగళూరులో స్థిరనివాసం ఏర్పరుచుకునేవారు కూడా ఉంటారు. ఆ సిటీకి ఉన్న ప్రాధాన్యత అలాంటిది. అయితే ఇప్పటి వరకూ అక్కడ ఉన్న వారంతా కన్నడ నేర్చుకోవాలని డిమాండ్ చేయలేదు. అక్కడ చదువుకోవాలంటే.. ప్రైవేటు స్కూళ్లలో అయినా సేర కన్నడ సెకండ్ లాంగ్వేజ్ గా చేసుకోవాలి. అందుకే.. అక్కడే స్థిరపడిన వారు ఖచ్చితంగా కన్నడ నేర్చుకుంటూ ఉంటారు.
అయినా కొంత మంది సోషల్ మీడియాలో చేస్తున్న అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఎక్కువ మంది వివాదాలు వస్తున్నాయి. చెన్నైలో ఉండేవాళ్లు తమిళం నేర్చుకోవాలి.. హైదరాబాద్‌లో ఉండేవారు తెలుగు నేర్చుకోవాల్సిందే లాంటి డిమాండ్లు పెట్టడం.. మారుతున్న నేటి సమాజంలో చిన్నతనం అవుతుందని.. ప్రపంచంతో పాటు ఎదగాలన్న సెటైర్లు ఇతరులు వేస్తున్నారు.