Bengalore Sun Roof Kiss : బెంగళూరులోని రద్దీగా ఉండే ట్రినిటీ రోడ్డుపై కదులుతున్న కారు సన్‌రూఫ్ ద్వారా ఒక యువ జంట అత్యంత అనుచితంగా ప్రవర్తిస్తూ కెమెరాలకు చిక్కింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఆ జంట బహిరంగంగా , గాఢంగా లిప్ కిస్‌లు ఇస్తూ కనిపించారు. ఇతరులు వీరి చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వాహనం కదులుతున్న సమయంలోనే ఈ చర్యలు ఇతరులకు ఇబ్బందికరంగా మారింది. హలసూరు ట్రాఫిక్ పోలీసుల అధికార పరిధిలో జరిగింది, ఇది పబ్లిక్ స్థలాల్లో నీతి సంబంధమైన అనుచిత ప్రవర్తన గురించి మాత్రమే కాక, రోడ్డు భద్రత గురించి కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని పలువురు చెబుతున్నారు. పబ్లిక్ రోడ్లు ప్రైవేట్ లాంజ్‌లుగా మారినట్లు, ఈ రకమైన ప్రవర్తనను ఎటువంటి పరిణామాల భయం లేకుండా బహిరంగంగా ప్రదర్శించడం షాకింగ్‌గా ఉందని పలువురుఅంటున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి , సభ్యత మరిచి స్పష్టంగా ఉల్లంఘించడమే కాక, రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరి భద్రతకు ప్రమాదాన్ని తెచ్ి పెట్టింది. ఇటువంటి బహిరంగ ప్రదర్శనలు అసభ్యకరమైనవి మాత్రమే కాక, ముఖ్యంగా పబ్లిక్‌లో ఈ చర్యలను చూసే యువత, పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది. భద్రత, సభ్యత సమాజంలో పరస్పర గౌరవానికి భంగం కలిగించకూడదని ంటున్నారు.
ఈ జంటపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ , సభ్యత చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కదులుతున్న కారులో సన్ రూఫ్ లో నిలబడటం ఇల్లీగల్ అని 90 శాాతం మందికి తెలియదని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. నిలబడటమే తప్పు అయితే వీళ్లు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు.