Onam Bumper Result: ఓనం బంపర్ 2022 (BR-87) లేదా తిరువోణం బంపర్ ఫలితాలను కేరళ రాష్ట్ర లాటరీ విభాగం ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించిన బహుమతులలో తిరువనంతపురంలో విక్రయించిన టిక్కెట్‌పై రూ. 25 కోట్లు నుంచి రూ.1,000 వరకు బహుమతులు ప్రకటించింది. 

తిరువనంతపురంలో ఓనం బంపర్ 2022 (BR-87) లాటరీ డ్రాన్‌ను సెప్టెంబర్ 18న తీసింది. టికెట్ నంబర్ TJ 750605 రూ. 25 కోట్ల విలువైన మొదటి బహుమతిని గెలుచుకుంది. 32 ఏళ్ల అనూప్ అనే ఆటో డ్రైవర్ దీన్ని గెలుచుకున్నాడు. ఆటో నడవని రోజు కూలీకి వెళ్లేవాడు. ఇప్పుడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. అతను ఈ టిక్కెట్‌ను తిరువనంతపురంలోని పజవంగడి భగవతి ఏజెన్సీ వద్ద విక్రయించినట్లు సమాచారం.

టీజీ 270912 నంబర్ గల టికెట్ రెండో బహుమతి రూ.5 కోట్లు గెలుచుకుంది. కొట్టాయంలోని మీనాక్షి లాటరీ ఏజెన్సీ వారు లాటరీ టిక్కెట్‌ను విక్రయించారు.తిరువోణం బంపర్ BR 87 2022 విజేతల పూర్తి జాబితా ఇలా ఉంది:1వ బహుమతి: రూ. 25 కోట్లువిజేత: TJ 750605 (తిరువనంతపురం)2వ బహుమతి: రూ. 5 కోట్లువిజేత: TG 270912 (కొట్టాయం)3వ బహుమతి: రూ. 1 కోటి. దీన్ని పది మంది గెలుచుకున్నారు. కన్సోలేషన్ బహుమతి: రూ. 5 లక్షలు. వీటిని తొమ్మిది మంది గెలుచుకున్నారు. 4వ బహుమతి: రూ. 1 లక్షవిజేత సిరీస్: 419175వ బహుమతి: రూ. 5,0006వ బహుమతి: రూ. 3,0007వ బహుమతి: రూ. 2,0008వ బహుమతి: రూ.1,000/-