Golden Tongue Mummies:
డెల్టా ప్రాంతంలో..
ఈజిప్ట్‌లో "మమ్మీ"లపై ఎన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చినా...పరిశోధనలు చేసే కొద్ది కొత్త విషయాలు బయట పడుతున్నాయి. సెంట్రల్ నైల్ డెల్టాలోని ఓ సమాధిలో తవ్వకాలు జరపగా...మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని మమ్మీలు బంగారు నాలుకలతో ఉండటాన్ని గమనించారు పురావస్తు శాఖ అధికారులు. ఆర్కియాలజీ విభాగానికి సంబంధించిన సుప్రీం కౌన్సిల్ ఆదేశాలతో ఇక్కడ తవ్వకాలు జరపగా...ఇవి బయట పడ్డాయి. Egypt Independent ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ప్రాంతంలో మరెన్నో సమాధులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే....ఇవన్నీ ఒకే కాలానికి చెందినవి అయ్యుండవని భావిస్తున్నారు అధికారులు. ఈ మమ్మీలను బయటకు తీసిన సమయంలో నోళ్లలో "మనుషుల నాలుకను" పోలి ఉండే బంగారు రేకులను గుర్తించారు. కొన్ని మమ్మీల ఎముకలు బంగారంతో పూత పూయగా...మరి కొన్ని మమ్మీలు గోల్డ్ స్కారబ్స్ వద్ద పూడ్చివేసినట్టు గుర్తించారు. చెక్కతో తయారు చేసిన శవ పేటికలతో పాటు రాగితో తయారు చేసిన స్క్రూలు కనిపించాయి. మమ్మీలు జీర్ణావస్థలో ఉన్నాయని, బంగారు పూత మాత్రం అలాగే ఉందని అధికారులు వెల్లడించారు. డెల్టా ప్రాంతంలో Quesna Quarries Cemetery చాలా కీలకమైంది. మమ్మీలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందించింది ఈ శ్మశానం. 1989లో ఈ ప్రాంతాన్ని గుర్తించారు. రోమన్ కాలంలో ఇది ఆక్రమణకు గురైందని అంచనా వేస్తున్నారు. గతేడాది కూడా పురావస్తు అధికారులు బంగారు నాలుకతో ఉన్న ఓ పుర్రెను కనుగొన్నారు. అంతకు ముందు ఓ పురుషుడు, మహిళ, బాలుడి మమ్మీలను గుర్తించారు. ఇవి 2,500 సంవత్సరాల క్రితంవి అని తేల్చి చెప్పారు.
వింత మమ్మీ..
ఇటీవల జపాన్‌లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన ‘మమ్మీ’ని చూసి ఆశ్చర్యపోయారు. నడుము వరకు మనిషిలా, మిగతా భాగం చేప తరహాలో ఉండటంతో షాకయ్యారు. అప్పటి వరకు ‘మత్స్యకన్య’ అనేది అపోహ మాత్రమే అని అనుకున్న పరిశోధకులు ఆ ఆలయంలో దొరికిన ‘మత్స్యకన్య’ను స్కాన్ చేయడం మొదలుపెట్టారు. 300 ఏళ్ల కిందట ఓ మత్స్యకారుడికి దొరికిన ఈ ‘మత్స్యకన్య’ను ఎవరు ఆలయంలో పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీయే. ‘మత్స్యకన్య’లో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయని, దాన్ని పూజిస్తే ఆరోగ్యంగా జీవిస్తారనే విశ్వాసంతో గత కొన్ని శతాబ్దాలుగా దానికి పూజలు అర్పిస్తున్నారు. ఆ పెట్టలో ఉన్న నోట్ ప్రకారం 1736-1741 మధ్య కాలంలో ఒక మత్స్యకారుడు దాన్ని పట్టుకున్నాడని, దాన్ని అతడు ఓ సంపన్న కుటుంబానికి విక్రయించినట్లు ఉంది. ఒకాయమా ఫోక్‌లోర్ సొసైటీ బోర్డు సభ్యుడు హిరోషి కినోషితా ఈ మత్య కన్య మూలలను తెలుసుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాన్ని పరిశీలించడం కోసం ఇప్పటికే ఆలయ నిర్వాహకుల అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆ మమ్మీకి CT స్కాన్ నిర్వహించారు. దాని DNA నమూనాలను సైతం పరిశీలిస్తున్నారు. దాని ఫలితాలు ఈ ఏడాదిలో ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే, అది కోతి-చేప సంక్రమణ వల్ల పుట్టిన కొత్త జాతి కావచ్చని భావిస్తున్నారు.
Also Read: Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి