Apple rents office in Bengaluru costing Rs 1000 crore: ఆపిల్ ఇండియా బెంగళూరులోని ఎంబసీ గ్రూప్‌కు చెందిన ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందం మొత్తం విలువ రూ. 1,010 కోట్లు.  ఇందులో అద్దె, పార్కింగ్ సహా నిర్వహణ ఖర్చులు ఉన్నాయి. ఈ ఒప్పందం బెంగళూరు వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అతిపెద్ద సింగిల్-టెనెంట్ లీజు ఒప్పందాలలో ఒకటిగా  భావిస్తున్నారు.   బెంగళూరులోని సంకే రోడ్‌లో ఉన్న ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం కార్పెట్ ఏరియా  1.96 లక్షల చదరపు అడుగులు, చార్జబుల్ ఏరియా  2.68 లక్షల చదరపు అడుగులు యాపిల్ ఇండియా లీజుకు తీసుకుంది.  నెలవారీ అద్దె రూ. 6.31 కోట్లుగా ఒప్పందం చేసుకున్నారు.  ఇది చదరపు అడుగుకు రూ. 235గా ఉంది. ప్రతి సంవత్సరం 4.5% అద్దె పెరుగుదల ఉంటుంది,. దీని వల్ల 10 సంవత్సరాలలో మొత్తం ఖర్చు రూ. 1,010 కోట్లకు పైగా ఉంటుంది. ఆపిల్ రూ. 31.57 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. ఆపిల్‌కు గ్రౌండ్ నుండి నాలుగో అంతస్తు వరకు అదనంగా 1.21 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకునే ఆప్షన్ ఉంది.  ఇది స్వీకరించినట్లయితే మొత్తం స్థలం సుమారు 4 లక్షల చదరపు అడుగులకు చేరుకుంటుంది.  ఒప్పందంలో 362 కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. 

ఎంబసీ గ్రూప్‌కు చెందిన మాక్ చార్లెస్ (ఇండియా) లిమిటెడ్ యాజమాన్యంలోని ఎంబసీ జెనిత్, గతంలో లే మెరిడియన్ హోటల్ ఉన్న 2.3 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఈ ప్రాంతం బెంగళూరు  ప్రైమ్ కమర్షియల్ హబ్‌లలో ఒకటి.  ఈ లీజు ఒప్పందం బెంగళూరులో అతిపెద్ద సింగిల్-టెనెంట్ కార్యాలయ లీజు ఒప్పందాలలో ఒకటిగా భావిస్తున్నారు.  ఇది భారతదేశంలో ఆపిల్  విస్తరణ ,  దీర్ఘకాలిక ప్రణాళికల్ని సూచిస్తుంది. ఈ కార్యాలయం 1,200 మంది ఉద్యోగులకు స్థలం కల్పించగలదని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంబసీ జెనిత్ భవనం 100% పునరుత్పాదక శక్తితో నడుస్తుంది.  LEED ప్లాటినం రేటింగ్ (ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్‌లో అత్యున్నత సర్టిఫికేషన్) సాధించే లక్ష్యంతో ఉంది.  భవనం లోపల స్థానికంగా లభించే రాయి, కలప,   ఫాబ్రిక్‌తో డిజైన్ చేశారు.    ఆపిల్ భారతదేశంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఎగుమతిదారుగా ఉంది, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ఫాక్స్‌కాన్, ఆపిల్  ప్రధాన సరఫరాదారు, బెంగళూరులోని దేవనహళ్లిలో రూ. 25,000 కోట్ల పెట్టుబడితో ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రారంభించిం.  ఇది చైనా బయట ఫాక్స్‌కాన్   రెండవ అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్‌.