ఏపీలో టెన్త్ విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఏపీ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్  టెన్త్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అంటే ఏప్రిల్‌ 25 నుంచి 30వ తేదీలోపు టెన్త్‌ ఫలితాలు ప్రకటించనుంది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్‌ను నమోదు చేసి ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల అధికారిక విభాగాలు వెల్లడించాయి. కాగా గతేడాది మే 6వ తేదీన పదో తరగతి ఫలితాలు వెల్లడించామని, ఈ ఏడాది అంతకంటే ముందే ఫలితాలు వెల్లడిస్తామని డైరెక్టర్‌ దేవానంద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు మార్చి18 నుంచి మార్చి 30 వరకు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వార్షిక పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో దాదాపు 3473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రక్రియ అనంతరం వెనువెంటనే సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించి ఏప్రిల్‌ 8 నాటికి ముగించారు. మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు, కంప్యూటరీకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ విధానం పూర్తి చేసేందుకు మరో వారం సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో టెన్త్ పరీక్ష ఫలితాల విడుదలకు కూడా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరైంది. ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు ఏప్రిల్‌ చివరి వారంలో ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైతే మే మొదటి వారంలో ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఫలితాల విడుదల వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకునేందుకు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాలతోపాటు మార్కుల మెమోను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత కొన్ని రోజులకు తాము చదువుకున్న పాఠశాలల నుంచి విద్యార్ధులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పొందవచ్చు. అయితే మార్క్‌ షీట్‌లో గ్రేడ్స్‌ మాత్రమే ఉంటాయి. ఏ సబ్జెట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలు అందులో ఉండవని బోర్డు పేర్కొంది.


ALSO READ:


AP Inter Memos: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థుల షార్ట్‌ మెమోలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి షార్ట్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 12న ఇంటర్ పరీక్షల ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 8,55,030మంది పరీక్షలు రాయగా.. ప్రథమ సంవత్సరంలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 


ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కుల మెమో కోస్ం క్లిక్‌ చేయండి..


ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం మార్కుల మెమో కోస్ం క్లిక్‌ చేయండి..


ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మే 15 నుంచి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు..
ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియను మే 15 నుంచి ప్రారంభించనున్నారు. రెండు విడతలుగా ప్రవేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో మే 15 నుంచి దరఖాస్తులు విక్రయించి, జూన్‌ 1 లోపు వాటిని స్వీకరిస్తారు. ఇక మే 22 నుంచి మొదటి విడత ప్రవేశాలు చేపట్టాలని, జూన్‌ 1 లోపు పూర్తి చేయనున్నారు. రెండో విడత ప్రవేశాలను జూన్‌ 10 నుంచి జులై 1 లోపు పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..