By : ABP Desam | Updated: 26 Nov 2022 02:26 PM (IST)
టీడీపీ నేత ,విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికార వైసీపీ కి జై కొట్టనున్నట్టు తెలుస్తోంది . గంటా శ్రీనివాసరావు సన్నిహితులు ఇప్పటికే ఆ మేరకు లీకులు ఇస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో వైజాగ్ పర్యటన కు వస్తున్న సీయం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసిపీ లో చేరుతారనే ప్రచారం ఊపందుకోంది.డిసెంబర్ 1 న గంటా ఫుట్టిన రోజు సందర్భంగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్ ఉంది.2019 లో టీడీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ను నిరసిస్తూ ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందించగా అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. అయితే టీడీపీ పార్టీ కార్యక్రమాలకు సైతం గంటా గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు.పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ కు వచ్చిన సందర్భాల్లోనూ గంటా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు.అదే సమయంలో గంటా ను పార్టీలోనే అట్టి పెట్టుకునే ప్రయత్నాలు చేసింది తెలుగుదేశం అధిష్టానం. స్వయంగా అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి మరీ ఆయన కుటుంబ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత కూడా గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనలేదు.కేవలం అయ్యన్న పాత్రుడు అరెస్ట్ విషయంలో మాత్రమే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు. అయితే.. ఇప్పుడు వైసిపీ లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు ఆయన క్యాంప్ సంకేతాలు ఇస్తోంది.
కాసేపట్లో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. 11.56 నిమిషాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటరర్ నుంచి పీఎస్‌ఎల్వీసీ 54 ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌కు శుక్రవారం ఉదయం 10.26 నిమిషాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. రాకెట్ లాంచ్ అయ్యే వరకు ఈ కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ ఆర్ముగంరాజరాజన్ ఈ కౌంట్‌డౌన్ ప్రారంభించారు.
శుక్రవారం సాయంత్రం రాకెట్‌లోని నాల్గో దశలో ఇంధనాన్ని నింపారు. అనంతరం రాకెట్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. రాత్రి 10 గంటల తర్వాత రెండోదశకు ఇంధనాన్ని ఫిల్ చేశారు. ఈ ప్రయోగం ద్వారా 9 ఉప గ్రహాలను భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్‌సింక్రోనస్
🔴భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్దమైంది.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 26, 2022
🔴ఈ రోజు తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ PSLV.. C-54 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. pic.twitter.com/wiJdeoPQ0Y
ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ రాకెట్ ప్రయోగానికి ముందు చెంగాళమ్మ దేవాలయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సందర్శించారు. రాకెట్ నమూనాను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్... డిసెంబర్‌లో రెండు ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అగ్నికుల్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ప్రయోగాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. దీంతోపాటు గత నెలలో విఫలమైన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–1 రాకెట్ ప్రయోగాన్ని కూడా ప్రయోగించనున్నారు. వీటితోపాటు 2023 ఫిబ్రవరిలో పీఎస్‌ఎల్‌వీ మార్క్–3 రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలు నింగిలోకి పంపించనున్నారు.
Indian Space Research Organisation (#ISRO) all set to launch PSLV C 54 with Earth observation satellite Oceansat and eight other nano satellites in two different orbits today. pic.twitter.com/EbKIJcPwiG
— All India Radio News (@airnewsalerts) November 26, 2022
భారత్‌లోని 100 అంకుర సంస్థలు ఇస్రోతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ మధ్య కాలంలోనే చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఇప్పటికే ఈ కంపెనీలు ఇస్రోతో కలిసి పని చేసేందుకు రిజిస్టర్ చేసుకున్నాయని చెప్పారు. బెంగళూరు టెక్ సమ్మిట్ 2022 సదస్సుకి హాజరైన ఆయన మరి కొన్ని వివరాలు పంచుకున్నారు. తమతో పని చేసేందుకు రెడీగా ఉన్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు. ఓ ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి చేసేంత వరకూ అవసరమైన స్పేస్ టెక్నాలజీని అందించేందుకు ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
భారత్‌లో స్పేస్‌టెక్ సెక్టార్‌లోకి అడుగు పెడుతున్న సంస్థలు భవిష్యత్‌లో కీలక పాత్ర పోషిస్తాయన్న సోమనాథ్...ఇస్రో ఆయా కంపెనీలకు అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. 100 కంపెనీల్లో దాదాపు 10 సంస్థలు..ఇప్పటికే కొన్ని శాటిలైట్స్, రాకెట్స్ తయారు చేశాయని వివరించారు. మరి కొన్ని నెలల్లోనే చంద్రయాణ్-3 (Chandrayaan-3) మిషన్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఇస్రో..నాసాతో కలిసి పని చేస్తుందని తెలిపారు. భారత్‌లో అంతరిక్ష రంగం ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో ఈ సేవల్ని ఎలా విస్తృతం చేయాలో ఆలోచిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. కొత్త ప్రొపల్షన్ విధానాలు అనుసరించాలని సూచించారు. గ్రీన్ ప్రొపెలంట్,ఎలక్ట్రిక్ ప్రొపెలంట్, న్యూక్లియర్ ప్రొపెలంట్ లాంటి సాంకేతికతలను ఇప్పటికే ఇస్రోలో కొన్ని ప్రాజెక్ట్‌ల కోసం వినియోగి స్తున్నామని పేర్కొన్నారు సోమనాథ్.
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!