AP Minister Peddireddy Ramachandra Reddy: చిత్తూరు : టిడిపి‌ అధినేత‌ నారా చంద్రబాబు నాయుడుపై ఏపి అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు. సోమలలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వార్డు మెంబర్ లా దిగజారి మాట్లాడుతున్నారని, నన్ను చంద్రబాబు పుడింగి అంటున్నాడని, అసలు పుడింగికి అర్థం ఏంటో తెలుసా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. కుప్పంలో ఘోరంగా ఒడిపోయినా చంద్రబాబు పుంగనూరుకు వచ్చి నన్ను ఏం చేయగలవు అని ఆయన అన్నారు. 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి మూడు చెరువుల నీళ్లు తాగించాంమని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. పుంగనూరులో నా కథ తేలుస్తాను అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, చంద్రబాబు కాదు, వాళ్ళ తాతలు దిగొచ్చినా వాళ్ళ తరం కూడా కాదన్నారు. చంద్రబాబు అనుకుని‌ ఉంటే‌ నేను జిల్లాలో తిరేగేవాన్ని కాదని చెప్పడం వింటే నవ్వు వస్తొందని చెప్పిన ఆయన, నీ‌ కంటే 14 సంవత్సరాలు ఆయన కంటే ఆధిక్యంలోనే నేను కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇచ్చినట్లు‌ చెప్పారు.‌ 14 సంవత్సరాలు నువ్వు చేసేదేంటి మీ కంటే నేనే ఎక్కువ చేశానన్నారు. 


జిల్లాలో తన కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించగలవా అంటూ‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకి‌ సవాల్ విసిరారు. కాలేజ్ రోజుల నుండి చంద్రబాబుకి జీవిత కాలం పట్టింది నాపై ఆధిక్యత సాధించడానికి అని విమర్శించిన పెద్దిరెడ్డి, ఇందిరమ్మ పేరుతో చంద్రబాబు శాసనసభ్యుడు అయ్యాడన్నారు. దివంగత ఎన్టీ రామారావు కుమార్తెను పెళ్లి చేసుకొని కుప్పంలో ఉన్న అభ్యర్థిని రాజీనామా చేయించి కుప్పంలో గెలిచావన్నారు. రామారావు అల్లుడు కాకపోయింటే నువ్వు శాసన సభ్యడు అయ్యుంటావా అని ప్రశ్నించారు. నీకు రామారావు పేరు అండగా ఉంది కాబట్టి రాజకీయాల్లో రాగలిగావన్నారు. చంద్రబాబుకి నాతో పోల్చుకునేందుకు అర్హత లేదన్నారు. నేను 1993 నుంచి పాల వ్యాపారంలో ఉన్నానని, నీ మాదిరిగా పార్ట్నర్స్ కు మోసం చేసి వేల కోట్లు సంపాదించ లేదన్నారు. 


తాను దౌర్జన్యం చేసి పాలు తీసుకుంటుంటే ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేయగలనా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నీకు సిగ్గు లేదా అబద్దాలు చెప్పడానికి అని‌ ప్రశ్నించారు. జిల్లాలో అందరికి చంద్రబాబు  బతుకు ఏంటో తెలుసునని, నా బట్టలు ఉడదీస్తా అని మాట్లాడుతున్నాడు, సిగ్గు లేదా నీకు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నీ బట్టలు ఎప్పుడో ఊడి పోయాయని తెలుసుకోవాలన్నారు. కుప్పంలో చంద్రబాబు బతుకు తెల్లవారి పోయిందని, 2024లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైనల్ గా కుప్పంలో నీ బట్టలు ఊడిపోతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.


ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు...


‘రాజధాని అమరావతిలో నా ఇంటి మీద దాడి చేశారు నా ఇంటి గేట్లకు తాడు కట్టారు. ఇప్పుడు నా సొంత నియోజకవర్గ కుప్పంలో పోలీసుల ద్వారా దాడులు చేయించారు. రాష్ట్రంలో సైకో పాలన జరుగుతోంది. కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసి నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం చేస్తా ‘.. పెద్దిరెడ్డికి చంద్రబాబు సవాల్