ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఇంటర్ పరీక్షలు వెల్లడించి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించింది. విద్యార్థులు ఫలితాల్ని అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవాలని సూచించారు.

Continues below advertisement

ఈ ఏడాది ఏపీలో ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్ని ఏళ్లతో పోలిస్తే పెరిగింది. మొత్తం 10,57,899 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కాగా, వీరిలో ఫస్టియర్  విద్యార్థులు 5,31,275 మంది ఉండగా, రెండో సంవత్సరానికి చెందిన విద్యార్థులు 5,06,264 మంది ఉన్నారు. జనరల్ స్ట్రీమ్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు. ఈ ఏడాది పరీక్షల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా హాజరుశాతం భారీగా నమోదయ్యింది.

అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు

ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్‌లపై ఒత్తిడి పెరిగి అవి మొరాయించే అవకాశం ఉందని, ఫలితాలు చెక్ చేసుకునేందుకు విద్యార్థుల కోసం రెండు ప్రధాన మార్గాలను బోర్డు సూచించింది. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ లో హాల్‌టికెట్ నంబర్, బర్త్ డే వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. వాట్సాప్ మనమిత్ర ద్వారా సైతం విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకుని తమ స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు స్క్రీన్‌పై కనిపించగా, భవిష్యత్ అవసరాల కోసం మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు.

వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలుఅధికారిక వెబ్‌సైట్ కాకుండా మన మిత్ర అనే వాట్సాప్ సేవను ఉపయోగించి కూడా ఏపీ ఇంటర్ ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు 9552300009 నెంబర్‌కు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపి, అందులో వచ్చే సూచనల ప్రకారం హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా సెకన్లలో ఫలితాలను విద్యార్థుల ఫోన్ స్క్రీన్‌పైకి వచ్చేలా ఇంటర్ బోర్డ్, విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.