Entrance Examination Schedule In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రానున్న విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ను ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షఈఏపీసెట్‌ (EAPCET-2022 to begin on July 4 in AP) జులై 4 నుంచి జులై 12 వరకు నిర్వహించనున్నారు. 


మూడేళ్ల లా కోర్సు, అయిదేళ్ల ఎల్ఎల్ఎం లా కోర్సులలో ప్రవేశాల కోసం లాసెట్, పీజీ ఎల్‌సెట్‌ జులై 13న నిర్వహించనున్నారు. అదే విధంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌ సైతం జులై 13న షెడ్యూల్ చేసింది ఉన్నత విద్యా మండలి. జులై 18 నుంచి జులై 21 వరకు ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం పీజీ ఈసెట్‌ (AP PG ECET 2022) పరీక్ష జరగనుంది. పీజీ కోర్సులైన ఎంబీఏ (MBA), ఎంసీఏ కోర్సుల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏపీ ఐసెట్ (AP ICET 2022) జులై 25న నిర్వహించనున్నారు. ఈసెట్‌ పరీక్షను జులై 22న నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.


ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు.. (Entrance Examination Schedule)



  • జులై 4 నుంచి జులై 12 వరకు ఈఏపీసెట్‌ (EAPCET-2022)

  • జులై 13న ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ (AP LAWCET 2022

  • జులై 18 నుంచి జులై 21 వరకు పీజీ ఈసెట్‌ (PGECET 2022)

  • జులై 22న ఈసెట్‌ (AP ICET 2022)

  • జులై 25న ఐసెట్‌ (AP ICET 2022)


ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్..



  • ఏప్రిల్‌ 27వ తేదీ - తెలుగు

  • ఏప్రిల్‌ 28వ తేదీ - సెకండ్‌ లాంగ్వేజ్‌

  • ఏప్రిల్‌ 29వ తేదీ - ఇంగ్లిష్‌

  • మే 2వ తేదీ -  గణితం

  • మే 4వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-1

  • మే 5వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-2

  • మే 6వ తేదీ  -  సోషల్ 


ఏపీలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్..  
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలు మే 6 నుంచి మే 24 వరకు జరుగనున్నాయి. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. దీంతో పరీక్షలను వాయిదా వేసి కొత్త షెడ్యూల్ ప్రకటించారు. 


Also Read: NEET UG 2022: ఏప్రిల్‌ 10న నీట్‌ నోటిఫికేషన్! జులైలో ఎగ్జామ్‌


Also Read: CLAT 2022 : జూన్ నెలలో క్లాట్ ఎగ్జామ్, ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు ఇవీ!