By: Ram Manohar | Updated at : 13 Jul 2022 03:42 PM (IST)
యూకే సంక్షోభంపై ఫన్నీగా ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా (Image Credits: Anand Mahindra/Twitter)
భవిష్యత్‌లో బ్రిటన్ ప్రధాని ఇల్లు ఇదే..
ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే సెలెబ్రిటీలలో ఆనంద్ మహీంద్రా ఒకరు. రోజూ ఏదో ఓ వెరైటీ ట్వీట్ పెడుతూ నవ్విస్తుంటారు. కొన్ని సార్లు ఆలోచింపజేసే ట్వీట్‌లూ చేస్తుంటారు. ఆయన ట్వీట్‌లలోని హ్యూమర్‌కు చాలా మంది నెటిజన్లు ఫిదా అయిపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో వర్తమాన అంశాలనూ ప్రస్తావిస్తూ సెటైరికల్‌గా ట్వీట్ చేస్తుంటారు ఆనంద్ మహీంద్రా. యూకేలో ప్రస్తుత రాజకీయ సంక్షోభం గురించి ఇలాగే స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయిపోతోంది. బ్రిటన్ ప్రధానమంత్రిని ఇంటి ఫోటోని షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఆ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఉన్నాయి. రెండు వైపులా స్వస్తిక్ ముద్రలు పెట్టారు. "ఫ్యూచర్ ప్రధాని ఇల్లు ఇలానే ఉంటుందేమో" అనే అర్థం వచ్చేలా ఆయన ఈ ఫోటోపెట్టి కామెంట్స్ యాడ్ చేశారు. ఇప్పటికే వెయ్యి మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయగా 16 వేల మంది లైక్ చేశారు. భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్నారు. ఈ అంశాన్నే హైలైట్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు మహీంద్రా. ఆయన ట్వీట్‌కు కొందరు ఫన్నీ రిప్లైలు ఇచ్చారు. అవి కూడా ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
The future of 10 Downing Street? The famed British humour is now laced with Desi humour…😊 pic.twitter.com/rjkYPhWDGX
— anand mahindra (@anandmahindra) July 12, 2022
This is missing pic.twitter.com/080atd1cp4
— vijay sheth (@vijaysheth) July 12, 2022
This is Missing pic.twitter.com/NuOcC3fef7
— Swati Swagatika (@SwatiSwagatik20) July 12, 2022
Sir mirchi aur nimbu hojaye to aur Shubh hoga. Kyu?
— Rohan Lagarwar (@LagarwarRohan) July 12, 2022
Also Read: Telangana Schools Holiday: తెలంగాణలో మరో 3 రోజులు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం ప్రకటన
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్