Allegations of technical faults on Air India plane:  అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానంవల్ల వందల మంది చనిపోయారు. ఇప్పుడు  ఆ విమానంలో లోపాలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. లండన్ కు బయలుదేరే ముందు ఆ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చింది. అలా వచ్చినప్పుడు ఓ ప్రయాణికుడు విమానంలో లోపాలపై ఓ వీడియో తీశాడు.  ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

 ప్రమాదం జరగడానికి కేేవలం రెండు గంటల ముందు విమానంలో పరిస్థితుల్ని అతను రికార్డు చేశాడు.  

ఇవే కాకుండా మరిన్ని లోపాలు  ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. విమానానని ఇటీవల రీఫర్బిష్‌మెంట్ చేయించినట్లుగా భావిస్తున్నారు.  ఇది సాంకేతిక లోపాలకు కారణం కావచ్చుననిచెబుతున్నారు. విమానం వయసు 11 సంవత్సరాలు.  బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, ఇది 2013 డిసెంబర్ 14న తొలి టెస్ట్ ఫ్లైట్ చేసి, 2014 జనవరి 28న ఎయిర్ ఇండియాకు డెలివరీ ఇచ్చారు.   విమానం మరీ పాతేం కానందుకు  సాంకేతిక లోపాల అవకాశం తక్కువని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) , ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రమాద కారణాలను విచారిస్తున్నాయి. బోయింగ్ సాంకేతిక బృందం కూడా విచారణలో సహకరిస్తోంది. 

కొంత మంది ఈ విమానాన్ని టర్కీకి చెందిన సాంకే్తిక నిపుణుల బృందం నిర్వహిస్తోందని కొత్త అనుమానాలను తెరపైకి తెస్తున్నారు. [ 

 మొత్తంగా ప్రమాదానికి కారణాలేమిటో  బయ పెట్టే వరకూ ఇలాంటి ఉహాగానాలు చెలరేగే అవకాశం ఉంది.