AKASA SPICEJET Collision: ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో AKASA AIR SPICE JET ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
న్యూఢిల్లీ Indira Gandhi International Airport-IGI లో రెండు విమానాలు ఢీ కొట్టడం ఆందోళన కలిగించింది. విమానాలను నిలిపి ఉంచే బే వద్ద ఇది జరిగింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు.

ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ: AKASA AIRలో ఇరుక్కున్న SPICEJet రెక్కలు
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న జరిగిన సంఘటన కలకలం రేపింది. SpiceJet కు చెందిన బోయింగ్ B737-700 (SG-124, లేహ్–ఢిల్లీ) విమానం, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆకాశ ఎయిర్ Akasa Air కు చెందిన బోయింగ్ 737 MAX 8 విమానం టెర్మినల్-1 లో ప్రమాదానికి గురయ్యాయి. బే నంబర్ 106 సమీపంలో టాక్సీయింగ్ సమయంలో ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.
ఎలా జరిగింది?
ప్రాథమిక సమాచారం ప్రకారం, అకాసా ఎయిర్ విమానం బే నంబర్ 104 నుంచి వెనక్కు వచ్చి.. ఇంజిన్ స్టార్ట్‌కు సిద్ధంగా నిలిచింది. అదే సమయంలో స్పైస్‌జెట్ విమానం బే నంబర్ 108 వద్ద హోల్డ్‌లో ఉంది. పైలట్ అకాసా విమానంతో సరైన దూరం ఉందని నిర్ధారించిన తర్వాత, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) స్పైస్‌జెట్‌కు బే 106కి టాక్సీ చేయడానికి అనుమతి ఇచ్చింది.
అయితే టర్న్ తీసుకునే సమయంలో ‘వింగ్ వాకర్’ క్లియరెన్స్ లేకుండా మలుపు తీసుకోవడంతో, స్పైస్‌జెట్ విమానం రైట్ వింగ్‌లెట్ అకాసా విమానం లెఫ్ట్ హారిజాంటల్ స్టెబిలైజర్‌ను తాకింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ... ప్రమాద తీవ్రత తక్కువైందేమీ కాదు. ఎందుకంటే.. స్పైస్‌జెట్ రెక్కల్లోని ఓ భాగం... ఆకాశా ఎయిర్ వింగ్స్‌లో ఇరుక్కుపోయింది.
ఈ ఘటనలో రెండు విమానాలకూ నష్టం వాటిల్లింది. వెంటనే వాటిని ఇన్‌స్పెక్షన్, మరమ్మతుల కోసం గ్రౌండ్ చేశారు.

DGCA విచారణ
ఈ ఘటనపై Directorate General of Civil Aviation (DGCA) విచారణ ప్రారంభించింది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ విధానాలు, ATC సూచనలు, పైలట్ చర్యలు అన్నీ పరిశీలనలో ఉన్నాయి. విచారణ పూర్తయ్యే వరకు స్పైస్‌జెట్ విమానం పైలట్లు సంబంధిత ATC అధికారి ను విధుల నుంచి తప్పించారు.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందన
Ministry of Civil Aviation ఈ ఘటనపై స్పందించింది. జరిగిన విషయంపై లోతుగా దర్యాప్తు జరుపుతామని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఆ మధ్య పై కప్పు కూలిపోవడం వంటి ఇన్ ఫ్రా సమస్యలు తలెత్తాయి. అయితే విమానాల ఆపరేషన్స్‌కు సంబంధించి తప్పు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు రెండు విమానాల్లో ప్రయాణికులు ఉన్నారు. ఇది ఏదైనా పెద్ద ప్రమాదానికి దారి తీసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది..? ఈ ఘటన విమానయాన భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది.
ట్రెండింగ్ వార్తలు




















