This Is Why Airplane Windows Are Round: విమానం అనేది సాధారణ వాడుకలో ఆకాశంలో ప్రయాణించడానికి వీలుగా రూపొందించిన వాహనం. ఒకప్పుడు విమానంలో ఎక్కాలి అంటే అదో డ్రీమ్‌గా ఫీల్‌ అయ్యేవాళ్లు.. కానీ ఇప్పుడు మాత్రం చాలా సర్వరసాధారణం అయిపోయింది. గత కొన్నేళ్ల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే విమానం ఎక్కే చాలా మంది విమానం కిటికీ వద్దే సీటు రావాలని కోరుకుంటారు. అయితే విమానాలు ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఎక్కువగా ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైన గమనించారా..? విమానం కిటికీలు కేవలం గుండ్రని ఆకారంలో ఎందుకు ఉంటాయని. ఇలా ఉండటం వెనుక భద్రతకు సంబంధించిన చాలా కారణాలే ఉన్నాయి. 


విమాన కిటికీల వల్ల జరిగిన ప్రమాదం:
విమానంలో కూర్చున్న సమయంలో గమనించారో లేదో ఏ విమాన కిటికీలను చూసిన చతురస్త్రం, దీర్ఘ చతురస్రం ఆకారంలో కాకుండా కాస్త గుండ్రంగానే ఉంటాయి. అసలు విమానాల కిటికీలు ఎందుకు గుడ్డు ఆకారంలా కాస్త గుండ్రంగా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అలానే రూపొందించడం వెనుక ఉన్న మతలబు ఏంటీ? విమాన కిటికీలను త్రిభుజాకారంలోనో, దీర్ఘ చతురస్రాకారంలోనో, చతురస్రాకారంలోనో ఎందుకు తయారు చేయరన్న విషయంపై ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 1950లో అప్పుడు జెట్ లైనర్ విమానాలు బాగా పేరున్న విమానాలు. ఇవి మిగతా విమానాలతో పోలిస్తే వేగంగా దూసుకెళ్లగల లక్షణాలు కలిగి ఉండటంతో పాటు ఎంత ఒత్తిడినైనా తట్టుకోగలిగేవి. కానీ, దీని కిటికీలు మాత్రం చతురస్రాకారంలో ఉన్నాయి. కొన్ని ప్రతికూల పరిస్థితుల ప్రభావం కారణంగా చాలా ఏళ్ల క్రితం ఓ విమానం కూలిపోయి పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే ఈ ప్రమాదానికి విమాన కిటికీలే కారణంగా తెలిసింది. దీంతో ఆ తర్వాత కిటికీల డిజైన్‌ను మార్చారు. 


విమానం కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి.?
కాలక్రమంలో విమానం ఎగిరే ఎత్తు పెరగడంతో పాటు వేగం కూడా పెరిగింది. దీంతో కిటికీల డిజైన్‌ గుండ్రంగా మారిపోయింది. విమానంలో వేగంగా ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో విండో గాలి ఒత్తిడిని తట్టుకోలేక త్వరగా పగుళ్లు ఏర్పడుతుంది. అయితే గుండ్రని ఆకారపు విండో గాలి ఒత్తిడిని ఈజీగా తట్టుకుంటుంది. దీంతో కిటికీ వక్రంగా ఉన్నందున పగుళ్లు ఏర్పడవు. విమానం ఆకాశంలో ఉన్నప్పుడు, విమానం లోపల గాలి పీడనం రెండు వైపులా ఉంటుంది. అందుకే విమానం గుండ్రని ఆకారంలో కిటికీలు ఉంటాయి. దీంతో అప్పటి నుంచి విమాన కిటికీలను గుండ్రంగా రూపొందించడం మొదలుపెట్టారు. అలా విమాన కిటికీలు గుండ్రంగా రూపొందించడం వల్ల ఒత్తిడి అనేది ఒకచోట కేంద్రీకృతం కాకుండా కిటీకీ చుట్టూ తిరిగి బయటకు వెళ్లిపోతుంది. అంతేకాదు తక్కువ ఒత్తడి మాత్రమే కిటికీపై పడటం వల్ల విమానాలు కూడా సురక్షితంగా ఉంటాయి.


విమానాలు టేకాఫ్‌ లేదా ల్యాండింగ్‌ సమయంలో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే వీటికి చెక్‌ పెట్టేందుకే.. విమానం 31 వేల నుంచి 38 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత, ప్రయాణీకులు వాటిని మూసివేయవచ్చు. అయితే, తక్కువ ఎత్తులో, ప్రయాణీకులు తమ కిటికీ షేడ్స్ తెరిచి ఉంచాలని విమాన సిబ్బంది చెబుతుంటారు. అయితే చేయడానికి కూడా ఓ సైంటిఫిక్‌ రీజన్‌ ఉందనే చెప్పాలి. విమానం లోపలి భాగం చీకటిగా ఉంటే, దాని వెలుపలి భాగం ప్రకాశవంతంగా మరియు ఎండగా ఉంటే, అత్యవసర సమయంలో విమానం నుంచి త్వరగా నిష్క్రమించడానికి ప్రయాణికులు కష్టపడవచ్చు.అందువల్ల, విమానయాన సంస్థలు టేకాఫ్‌లు మరియు ల్యాండింగ్‌ల సమయంలో కంటి చూపు సర్దుబాటు కోసం ప్రయాణికులు తమ విండో షేడ్స్‌ని తెరవాలని కోరుతుంటాయి.